ఇదేం క్రీడా స్ఫూర్తి.. కోహ్లీ గురించి ఇంగ్లాండు మాజీ సంచలన వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా అటు టీమిండియా మరికొన్ని రోజులు ఆడబోయే టెస్ట్ సిరీస్ గురించి చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇండియా పర్యటనకు రాబోతున్న ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది భారత జట్టు. అయితే గత కొంతకాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొడుతూ వరుసగా సిరీస్లను కైవసం చేసుకుంటున్న టీమిండియా.. ఇక ఇంగ్లాండ్తో కూడా టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడం ఖాయం అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో భారత జట్టు ముందుకు సాగడానికి ఈ టెస్ట్ సిరీస్ ఎంతో కీలకం కానుంది అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి అటు ఐదు మ్యాచ్లో టెస్ట్ సిరీస్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే కొంతమంది యువ ఆటగాళ్లకు కూడా ఈ టెస్ట్ సిరీస్లో అవకాశం కల్పించడం గమనార్హం. అయితే ఇదే విషయంపై ఎంతోమంది ఇంగ్లాండ్ మాజీలు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. సొంత గడ్డపై భారత జట్టును అటు ఇంగ్లాండ్ ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై పలు సూచనలు కూడా ఇస్తున్నారు అని చెప్పాలి.  ఇక ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 ఏకంగా ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని పదేపదే రెచ్చగొట్టాలి అంటూ ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని పదేపదే రెచ్చగొట్టాలి.  అతడితో మైండ్ గేమ్ ఆడి అతని ఈగోని దెబ్బ కొట్టాలి.. గత కొన్నెళ్లుగా ఐసిసి టైటిల్స్ ను గెలవలేకపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేయాలి. చోకర్స్ అంటూ స్లెడ్జింగ్ చేయాలి. ప్రతి వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో మీరు ఓడిపోతారు అంటూ కవ్వింపులకు దిగి విరాట్ కోహ్లీ ఏకాగ్రతను దెబ్బ తీయాలి అంటూ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కి సూచించాడు మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్. కాగా ఇదేం క్రీడా స్ఫూర్తి అంటూ ఎంతో మంది నెటిజన్స్ అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: