అశ్విన్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డ్.. మరో 10 వికెట్లు తీస్తే?

praveen
ప్రస్తుతం భారత జట్టులో సీనియర్స్ స్పిన్నర్ గా కొనసాగుతూ వున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే ఇటీవల  టీమిండియాలో యువ ఆటగాళ్ల హవా పెరిగిపోయిన నేపథ్యంలో ఎంతో సీనియర్ ప్లేయర్లు ఇక జట్టులో స్థానం కోల్పోయారు అన్న విషయం తెలిసిందే. కానీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం తన స్పిన్ బౌలింగ్ తో ఇప్పటికీ యంగ్ ప్లేయర్స్ ని కాదని తనను జట్టులోకి తీసుకునే విధంగా సెలెక్టర్లను ప్రభావితం చేస్తూ వస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా టీమిండియా ఏదైనా టెస్ట్ సిరీస్ ఆడుతుంది అంటే చాలు ఇక అశ్విన్ తప్పకుండా జట్టులో చోటు దక్కించుకుంటూ ఉంటాడు అని చెప్పాలి.

 అయితే కేవలం తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి చూపించడమే కాదు కొన్ని కొన్ని సార్లు బ్యాటింగ్ లో కూడా అదరగొడుతూ ఉంటాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక జట్టుకు అవసరమైన ప్రతిసారి కూడా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఉంటాడు అని చెప్పాలి. అంతేకాదు అశ్విన్ తెలివైన స్పిన్నర్ అని కూడా క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు. కాగా ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులు సాధించాడు అశ్విన్.

 ఇక ఇప్పుడు ఈ సీనియర్ ప్లేయర్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు అని చెప్పాలి. మరో 10 వికెట్లు సాధించాడు అంటే చాలు టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా 500 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్ లో చేరిపోతాడు రవిచంద్రన్ అశ్విన్. ఈనెలాఖరు నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న టెస్టు సిరీస్లో అశ్విన్ ఈ ఫీట్ ని నమోదు చేసే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది. కాగా మురళీధరన్ టెస్ట్ ఫార్మాట్లో 800 వికెట్లు సాధించి ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉండగా అతని తర్వాత షేన్ వార్న్ 708, అండర్సన్ 690 కుంబ్లే 619, బ్రాడ్ 604, మేక్ గ్రాత్ 563, వాల్ష్ 516, నాథన్ లియోన్  512 వికెట్లతో ఇప్పటికే ఇక ఈ ఫీట్ అందుకున్న బౌలర్లుగా కొనసాగుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: