హైదరాబాద్ క్రికెటర్ల 'బజ్ బాల్' ఆట.. చితక్కొట్టారుగా?

praveen
సాంప్రదాయ క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో ఆడే ప్రతి ఆటగాడు ఎన్ని పరుగులు చేశాడు అన్నదానికంటే ఎంతసేపు క్రీజులో పాతుకుపోయాడు అన్నదే ఎక్కువగా ముఖ్యం. అందుకే ఆటగాళ్ల ఓపికకు టెస్ట్ ఫార్మాట్ ఒక సవాలు లాంటిది అని చెప్పాలి. బౌలర్లు సంధించే వైవిధ్యమైన బంతలను పరుగులు చేయకపోయినా పర్వాలేదు కానీ బ్యాట్ తో సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉండాలి. ఇలాంటి నేమ్మదైన ఆట తీరు ఉంటుంది కాబట్టి టెస్ట్ ఫార్మాట్ కి అటు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ కూడా తగ్గిపోతోంది. అయితే ఇలాంటి సమయంలో టెస్ట్ ఫార్మాట్లో సరికొత్త పోకడకు నాంది పలికింది ఇంగ్లాండ్ జట్టు. టి20 తరహాలోనే దూకుడు అయిన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది.

 ఇలాంటి ఆట తీరుకు బజ్ బాల్ అనే పేరు పెట్టి ఇక ప్రత్యర్ధులను వనికిస్తోంది. ఏకంగా టెస్ట్ ఫార్మాట్లోనూ డిఫెండింగ్ గేమ్ కాదు అటాకింగ్ గేమ్ ఆడుతూ అదరగొడుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ద్వారా విఫలమైనప్పటికీ ఈ ఆట తీరుని మాత్రం అసలు వదులుకోవడం లేదు ఇంగ్లాండ్ జట్టు.  బ్యాటింగ్ కి వస్తే బాదుడు బౌలింగ్ కి వస్తే కూల్చుడు అనే విధానంతో మంచి ఫలితాలను రాబడుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇంగ్లాండ్ జట్టు తరహాలోనే ఇక ఇప్పుడు రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు కూడా బజ్ బాల్ బాట పట్టింది అన్నది తెలుస్తుంది.

 ఎందుకంటే రంజీ ట్రోఫీలో భాగంగా మూడో రౌండ్లో ఇటీవలే సిక్కింతో మొదలైన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్లు ఏకంగా విధ్వంసమే సృష్టించారు అని చెప్పాలి. సిక్కిం జట్టును 79 పరుగులకు అలౌట్ చేసింది హైదరాబాద్. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చి 62 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. ఏకంగా 381 చేశారు హైదరాబాద్ బ్యాటర్లు. తొలి ఇన్నింగ్స్ లో 27.4 లోని సిక్కిం జట్టు 79 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ దంచి కొట్టింది. తన్మయ్ అగర్వాల్ 125 బంతుల్లో 137, రాహుల్ సింగ్ 64 బంతుల్లో 83 తొలి వికెట్ కు 18 ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు. తర్వాత రోహిత్ రాయుడు 111 బంతుల్లో 75, తిలక్ వర్మ 66 బంతుల్లో 70 పరుగులు చేసి దంచి కొట్టడంతో హైదరాబాద్ రెండో రోజు ఆటో ముగిసే సరికి 381 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో హైదరాబాద్కు 302 పరుగుల ఆదిక్యం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: