ఇదేందయ్యా ఇది.. నేనేప్పుడు సూడాలా.. కారులో గేర్లు ఎక్కడున్నాయో తెలుసా?

praveen
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. మనిషి మెదడులో మెదిలే చిన్న ఆలోచన కొన్ని కొన్ని సార్లు సంచలనాలకు కారణం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి వినూత్నమైన ఆలోచనలను ఆచరణలో  పెడితే ఇక ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని ఎంతో మంది సామాన్యులే ఇప్పటివరకు నిరూపించారు. అయితే సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఎక్కడైనా ఇలా సరికొత్త ఆలోచనతో అద్భుతం సృష్టించారు అంటే అందుకు సంబంధించిన వీడియో గాని ఫోటో గాని ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంటుంది.

 ఇలాంటివి ఏవైనా సోషల్ మీడియాలోకి వస్తే నిమిషాలు వ్యవధిలో ప్రపంచం మొత్తం పాకి పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇలాంటి ఒక ఆశ్చర్యపరిచే ఇన్నోవేటివ్ టెక్నాలజీ వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో పైరల్ గా మారిపోవడంతో ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. బెంగుళూరులోని దురై అనే ఉబర్ డ్రైవర్ సొంతంగా ప్యాడిల్ షిప్టర్ ని తయారు చేసుకున్నాడు. ప్యాడల్ షిఫ్టర్ అనేది క్లచ్ ని ఉపయోగించకుండా గేర్లను మార్చడానికి సహాయపడుతూ ఉంటుంది. దురై అనే డ్రైవర్ క్లచ్ ఉపయోగించినప్పుడు తన భుజం నొప్పిగా ఉన్నందున దానిని తయారు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

 అయితే ఈ ప్యాడిల్ షిఫ్టర్ తయారీకి 9000 ఖర్చు అయింది అంటూ చెప్పుకొచ్చాడు డ్రైవర్. అయితే ఆ టాక్సీ లో ప్రయాణించిన ఓ ప్యాడిల్ షిఫ్టర్ ని చూసి ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అతను చాలా ప్రతిభవంతుడిని విజయం సాధించడానికి అతనికి మద్దతు మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశిస్తున్నట్లు అతను ఒక కామెంట్ కూడా పెట్టాడు. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన ఎంతోమంది నేటిజన్స్ దురై సరికొత్త ఆలోచనకు ఫిదా అయ్యారు. ఏకంగా అతని ప్రతిభకు సలాం కొట్టారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: