ఏం సాధించారు.. పాక్ వరస ఓటములకు.. అదే కారణం : రమిజ్ రజా

praveen
భారత దయాది దేశంగా కొనసాగుతున్న పాకిస్తాన్ జట్టు గత కొంతకాలం నుంచి వరుస పరాజయాలతో సతమతమవుతోంది అన్న విషయం తెలిసిందే  అయితే గత ఏడాది ఇండియా వేదిక జరిగిన వరల్డ్ కప్ టోర్నీ నాటి నుంచి కూడా అటు పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతూనే వస్తుంది. అయితే ఇక వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీగా ఉంది పాక్ జట్టు. అయితే ఏ ఒక్క సిరీస్ లో కూడా అటు ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. ఇక మూడు ఫార్మట్లలో సిరీస్ లు ఆడుతున్న ఒక సిరీస్ లో కూడా విజయం అందుకోలేకపోయింది.

 సొంత గడ్డపై సిరీస్ లు జరిగిన కూడా పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం అటు న్యూజిలాండ్తో 5 టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. కాగా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ముగియగా.. ఈ నాలుగింటిలో కూడా పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవి చూసింది అని చెప్పాలి. ఇలా పాకిస్తాన్ ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న వేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు రమిజ్ రజా మాత్రం ఆసక్తికర విషయాన్ని తెరమీదకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే టాప్ ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న వారిని విడదీసి జట్టు కూర్పును ఇష్టం వచ్చినట్లు మార్పు చేయడం వల్లే ఇక పాకిస్తాన్ జట్టుకు వరుస పరాజయాలు ఎదురవుతున్నట్లు తెలిపాడు.

 ఓపెనింగ్ జోడి నుంచి బాబర్ - మహమ్మద్ రిజ్వాను తప్పించడానికి తీవ్ర ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు సాధించారు  ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాలను ఎదుర్కొంటున్నారు. ఓపెనింగ్ మార్చాలని భావించినప్పుడు అందుకు తగ్గట్లు ఓ క్రమ పద్ధతిలో చేయాలి. లీగ్ లలో రాణిస్తున్నారని కొత్త ఆటగాళ్ళను తీసుకొచ్చినప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్ కు లీగ్ స్థాయికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముందు వెనక ఆలోచించకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ జోడిగా పేరుగాంచిన రిజ్వాన్ బాబర్ జోడిని విడదీశారు అంటూ రమిజ్ రాజా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: