అలా భయపడుతూ కూర్చుంటే.. ఏం చేయలేం : రోహిత్

praveen
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా  కొనసాగుతున్న రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఎంత అద్భుతమైన బ్యాటింగ్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ రోహిత్ మంచి ఆరంభాలు అందించడంతోనే ఇక తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన మిగతా ఆటగాళ్లు ఇక మంచి పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించడంలో సక్సెస్ అయ్యారు. అయితే అటు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లలో కూడా రోహిత్ పరవాలేదు అనిపిస్తున్నాడు. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టి20 సిరీస్ లో మాత్రం మొదటి రెండు మ్యాచ్ లలో రోహిత్ ఎంత తీవ్రంగా నిరాశపరిచాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 వరుసగా రెండు మ్యాచ్ లలో డక్ అవుట్ గానే వెనుతిరిగాడు రోహిత్ శర్మ. దీంతో అతను టి20 వరల్డ్ కప్ నాటికి ఫామ్ లోకి వస్తాడా లేదా అని అభిమానులు సైతం ఆందోళన చెందారు. కానీ మూడో టి20 మ్యాచ్లో మాత్రం అదరగొట్టేసాడు. ఏకంగా 63 బంతుల్లోనే 121 పరుగులు చేసి మెరుపు సెంచరీ తో చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. టీమిండియా మూడో టి20 మ్యాచ్ లో విజయం సాధించింది అంటే రోహిత్ శర్మ వన్ మ్యాన్ షో తోనే అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే టి20 ఫార్మాట్లో బ్యాటింగ్ విధానం పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 టి20 క్రికెట్ ఆడేటప్పుడు వికెట్ వికెట్ కోల్పోతామేమో అని భయపడవద్దు అంటూ రోహిత్ అన్నాడు. ఎంతో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది అంటూ తెలిపాడు. అయితే జట్టు తమకు ఇచ్చిన బాధ్యతను ప్రతి ఒక్క ప్లేయర్ కూడా నిర్వర్తించాలి అంటూ తెలిపాడు రోహిత్ శర్మ. అయితే ఇలా దూకుడుగా ఆడే క్రమంలోనే విరాట్ కోహ్లీ, సంజూ శ్యామ్సన్ ఇక డక్ అవుట్ గా వెనుదిరిగారు అంటూ ఇక వారికి మద్దతుగా నిలిచాడు రోహిత్ శర్మ. టి20 ఫార్మాట్లో భయపడుతూ కూర్చుంటే మంచి ప్రదర్శన ఎప్పటికీ చేయలేమని రోహిత్ తెలిపాడు. కాగా రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: