అలాంటి సమయంలో.. రోహిత్ ను అస్సలు కంట్రోల్ చేయలేం : అశ్విన్

praveen
ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టి20 సిరీస్ లో రోహిత్ శర్మ మరోసారి విశ్వరూపం చూపించాడు అన్న విషయం తెలిసిందే. వరుసగా మొదటి రెండు మ్యాచ్లలో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు రోహిత్ శర్మ. కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వెనుతిరిగాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక 14 నెలల గ్యాప్ తర్వాత రోహిత్ టి20 ఫార్మాట్ లోకి వచ్చాడు అని ఆనందపడుతున్న అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. రోహిత్ అదరగొడతాడు అనుకుంటే ఇలా ఆడుతున్నాడు ఏంటి అని అందరూ అవాక్కయ్యారు.

 కనీసం మూడో టి20 మ్యాచ్ లో అయినా రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరిస్తే బాగుండు అని కోరుకున్నారు అభిమానులు. అయితే మూడో టి20 మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరవడం కాదు.. ఇక బ్యాటింగ్లో వీర విహారం చేశాడు  63 బంతుల్లో 121 పరుగులు చేసి తన బ్యాటింగ్ రేంజ్ ఏంటో చూపించాడు. అంతేకాదు జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక సూపర్ ఓవర్లలో కూడా రోహిత్ అదరగొట్టేసాడు అని చెప్పాలి. సాధారణంగా సూపర్ ఓవర్ లాంటి డెత్ ఓవర్లలో ఇక రోహిత్ అద్భుతంగా రాణించిన తీరు అందరిని ఫిదా చేసేసింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇదే విషయంపై టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ చాలా ప్రమాదకర బ్యాట్స్మెన్. డెత్ ఓవర్లలో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. బౌలర్ ఎవరైనా సరే చివరి 4 ఓవర్లలో రోహిత్ శర్మ తప్పకుండా విధ్వంసం సృష్టిస్తాడు. ఎలాంటి బంతినైనా సరే సిక్సర్ గా లేదా ఫోర్ గా మలచడంలో రోహిత్ శర్మ సిద్ధహస్తుడు అంటూ ప్రశంసలు కురిపించాడు రవిచంద్రన్ అశ్విన్. కాగా అశ్విన్ వ్యాఖ్యలపై స్పందిస్తున్న ఎంతోమందిని నేటిజన్స్ మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే.. రోహిత్ ని ఎప్పటికీ తక్కువ అంచనా వేయలేమంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: