అప్పుడు హార్ట్ బ్రేక్.. ఇప్పుడు మళ్ళీ అతికింది?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ గత కొన్ని రోజుల క్రితం గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హెర్నియా సమస్యతో బాధపడుతున్న అతడు ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే బెడ్ మీద ఉన్న ఫోటోని షేర్ చేస్తూ త్వరగా కోలుకొని మళ్ళీ మీకోసం వస్తాను అంటూ ఒక పోస్ట్ పెట్టాడు సూర్య కుమార్ యాదవ్. అయితే హాస్పిటల్ బెడ్  మీద ఉంటూ కూడా ఇక సూర్యకుమార్ తనకు క్రికెట్ మీద ఉన్న మక్కువను చాటుకున్నాడు. ఇటీవల జరిగిన భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఆఖరి t20 మ్యాచ్ చూసాడు.

 రింకు సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేశాడు సూర్య కుమార్ యాదవ్. ఇది కచ్చితంగా భగవంతుడు రాసిన కథ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే రోహిత్ శర్మ సెంచరీ గురించి సూర్య కుమార్ యాదవ్ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. హార్ట్ సింబల్ తో రోహిత్ ను గ్రేట్ ఆఫ్ ఆల్ టైం గా అభివర్ణించాడు సూర్య కుమార్ యాదవ్. అయితే గతంలో అతను రోహిత్ శర్మను ఉద్దేశించి హార్ట్ బ్రేక్ సింబల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడం నచ్చక ఇలా సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ సింబల్ పెట్టి పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

 ఇక ఇటీవల రోహిత్ శర్మ సెంచరీ చేసిన తర్వాత ఫుల్ హార్ట్ సింబల్ పోస్ట్ చేశాడు సూర్య. దీన్నిబట్టి సూర్యకుమార్ యాదవ్కు అటు రోహిత్ శర్మ పై ఎంతటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కెరియర్ పరంగా సూర్యకుమార్ ఏదిగేందుకు రోహిత్ ఎంతగానో అండగా నిలిచాడు. రోహిత్ చొరవతోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సూర్యకుమార్.. ఇక అతని సారథ్యంలోనే వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చాడు అని చెప్పాలి. అందుకే రోహిత్ విషయంలో సూర్య కుమార్ యాదవ్ ఎప్పుడు ఎమోషనల్ గానే ఫీల్ అవుతూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: