అందరినీ సంతోషంగా ఉంచాలంటే కష్టం.. వరల్డ్ కప్ పై రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని క్రికెట్ జట్లు కూడా ఈ వరల్డ్ కప్ లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయ్. అయితే భారత జట్టు కూడా ఇక టి20 వరల్డ్ కప్ లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ జోరులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే ఇందులో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందరూ ఆటగాళ్లు కూడా మంచి ఫామ్ లో కొనసాగుతూ ఉన్నారు.

 దీంతో భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఏకంగా ఒక్కో స్థానానికి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు పోటీ పడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచ కప్ లో ప్రతిభవంతులైన ప్లేయర్లను ఎంపిక చేయటం క్రికెట్ స్వభావం అంటూ చెప్పుకోచ్చాడు. కొంతకాలం మేము టి20లో చాలామంది యువకులను ప్రయత్నించాం. వాళ్లు కూడా రాణించారు. అయితే ప్రధాన జట్టులో కొందరికి చోటు దక్కకపోవచ్చు. అది వారిని నిరాశ పరుస్తుంది.

 కాబట్టి ప్రపంచ కప్కు ఎంపిక చేసే జట్టుపై క్లారిటీ తీసుకురావడమే మా పని. మాకు ఉన్న 25 నుంచి 30 మంది ప్లేయర్లలో వారి నుంచి ఏం ఆశిస్తామో వారికి తెలుసు. ఇక టి20 వరల్డ్ కప్ కోసం జట్టును ఖరారు చేయలేదు. కానీ మైండ్లో ఎనిమిది నుంచి పదిమంది ప్లేయర్లు ఉన్నారు. వెస్టిండీస్ పరిస్థితుల ఆధారంగా జట్టును ఎంపిక చేస్తాం. కోచ్ తో చర్చించి జట్టును ఎంపిక చేయడానికి  ప్రయత్నిస్తాం. అయితే ఈ జట్టు ఎంపిక విషయంలో అందరిని సంతోషపరచలేము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: