స్మిత్ సైతం ఆశ్చర్యపోయాడు.. 85 ఏళ్ళ రికార్డు బద్దలు కొట్టిన యంగ్ ప్లేయర్?

praveen
సాదరణంగా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయాలని ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ ఇలా అరంగేట్రం చేసే అవకాశం వస్తే ఇక మొదటి అడుగులోనే అత్యుత్తమ ప్రదర్శన చేసి ఒక అరుదైన రికార్డును బద్దలు కొడితే ఈ అరంగేట్రం జీవితాంతం గుర్తుండిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి రికార్డులు కొలగొట్టడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. కానీ ఇలాంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించాడు వెస్టిండీస్ యంగ్ ప్లేయర్ షేమర్ జోసెఫ్.

 అరంగేట్రం మ్యాచ్లోనే ఏకంగా 85 ఏళ్ళ  రికార్డును బద్దలు కొట్టేశాడు. జాతీయ జట్టుకు ఆడాలన్న చిరకాల కల నెరవేర్చుకున్న రోజే ఏకంగా దిగ్గజాలను సైతం తన బౌలింగ్ తో ఆశ్చర్యపరిచాడు. ఏకంగా వేసిన తొలి బంతికే వికెట్ తీసాడు. అది కూడా ఏదో చిన్న టీంతో అనుకుంటే పొరపాటే. పటిష్టమైన ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టులో తొలి బంతికే వికెట్ దక్కించుకున్నాడు. అది కూడా దిగజ బ్యాటర్ అయినా స్టీవ్ స్మిత్ వికెట్ దక్కించుకోవడం గమనార్హం. దీంతో 85 ఏళ్ల రికార్డును సమం చేశాడు ఈ వెస్టిండీస్ యంగ్ బౌలర్. వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్రంలో వేసిన మొదటి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్గా రికార్డు సాధించాడు.

 అంతకుముందు 1939లో టిరిల్ జాన్సన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్తో మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. అయితే మొదటి మ్యాచ్ లోనే మొదటి బంతికి వికెట్ దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఓవరాల్ గా ఈ జాబితాలో 23వ బౌలర్గా నిలిచాడు షేమర్ జోసెఫ్. కాగా ప్రస్తుతం రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20లు ఆడేందుకు వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. ఇందులో భాగంగానే ఇటీవల ఆడి లైట్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్ లో షమార్ జోసెఫ్ విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. స్మిత్ తోపాటు నాథన్ లియోన్ వికెట్ ని కూడా అతనే దక్కించుకోవడం గమనార్హం. ఇక బ్యాటింగ్ లోను సత్తా చాటాడు. 41 బంతుల్లో 36 పరుగులు చేసి ఇక జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు ఈ యంగ్ ఆల్ రౌండర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: