జైస్వాల్ అరుదైన రికార్డ్.. రోహిత్ ను దాటేశాడుగా?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు భారత జట్టులోకి వస్తున్నారు. అయితే ఇలా వచ్చిన ఆటగాళ్లు కొంతమంది నిలకడలేమిటో చివరికి జట్టులో చోటు కోల్పోతుంటే ఇంకొంత మంది మాత్రం తమ ప్రతిభతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా టీమ్ ఇండియాలో తమ ప్రతిభతో ఫ్యూచర్ స్టార్స్ అని నిరూపించుకున్న ఆటగాళ్లలో అటు యశస్వి జైశ్వాల్  కూడా ఒకరు.

 బ్యాటింగ్ విధ్వంసం అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటాడు యశస్వి జైష్వాల్. ఇక అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అతని ఆట తీరులో ఎక్కడ మార్పు రాలేదు. ఏకంగా బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ అదరగొట్టేస్తూ ఉన్నాడు. టీమ్ ఇండియాకు మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ ఓపెనర్ గా జైస్వాల్ మారడం ఖాయమని అందరిలో నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ క్రికెట్లో కూడా రికార్డుల వేట మొదలెట్టాడు ఈ యంగ్ ప్లేయర్.

 అయితే యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ ఇటీవల ఒక అరుదైన ఘనత సాధించాడు. టి20 ఫార్మట్లో 23 ఏళ్లలోపే అత్యధిక 50 ప్లస్ స్కోర్ చేసిన భారత బ్యాట్స్మెన్ గా నిలిచాడు యశస్వి జైస్వాల్. 22 ఏళ్ల యశస్వి 16 మ్యాచ్లలో ఏకంగా 498 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉన్నాయి అని చెప్పాలి. అయితే యశస్వి జైస్వాల్ తర్వాత స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇక ఆ తర్వాత పంత్, తిలక్ వర్మ 23 ఏళ్ల వయసులోనే రెండు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. యశస్వి జైష్వాల్ బ్యాటింగ్ తీరు చూస్తే రానా రోజుల్లో  భారత క్రికెట్లో హవా నడిపించడం ఖాయం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: