సెలక్టర్లు అలా చేయడంతో షాకయ్యా.. దావన్ షాకింగ్ కామెంట్స్?

praveen
భారత జట్టులో యువ ఆటగాళ్ళ రాకతో ఎంతో మంది సీనియర్ ప్లేయర్ల స్థానం గల్లంతయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు భారత జట్టుకు అసమాన్యమైన సేవలు చేసిన క్రికెటర్లను సైతం ఇక సెలక్టర్లు పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. జట్టు ప్రయోజనాల కోసం కాస్త కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఇక సీనియర్లను జట్టు నుంచి తప్పించడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఇలా యువ ఆటగాళ్ళ రాకతో భారత జట్టులో చోటు కోల్పోయిన స్టార్ ప్లేయర్లలో భారత సీనియర్ శిఖర్ ధావన్ కూడా ఒకరు.

 ఒకప్పుడు రోహిత్ శర్మకు ఓపెనర్ పార్ట్ నర్ గా ఉన్న శిఖర్ ధావన్ తన ఆటతీరుతో కోట్ల మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు అని చెప్పాలి. అయితే అతను టీమిండియా తరఫున ఆడి దాదాపు ఏడాది దాటింది. 2022లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో తన చివరి వన్డే సిరీస్ ఆడాడు శిఖర్ ధావన్. ఇక అప్పటి నుంచి మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ లో రాణించినప్పటికీ అతన్ని మాత్రం కలెక్టర్ పక్కన పెడుతూనే ఉన్నారు. అయితే ఆసియన్ గేమ్స్ లో శిఖర్ ధావన్ కి చోటు దక్కుతుందని అందరూ అనుకున్నప్పటికీ అది జరగలేదు.

 అదే విషయంపై గబ్బర్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియన్ గేమ్స్ లో తనను ఎంపిక చేస్తారని అనుకున్నాను అంటూ ధావన్ తెలిపాడు. ఆసియన్ గేమ్స్ కోసం ప్రకటించిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యాను. అయితే సెలెక్టర్లు ఆలోచనలు భిన్నంగా ఉంటాయేమో అనుకున్నాను. వాటిని మనం అంగీకరించాలి. నా భవిష్యత్తు గురించి ఏ సెలెక్టర్ తోను నేను మాట్లాడలేదు. ఎంసీఏ కి క్రమం తప్పకుండా వెళుతున్నాను. ఎంసీఏ నా కెరియర్ కు ఎంతో సహాయపడింది అంటూ ధావన్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సీనియర్ కెరియర్ ముగిసినట్టే అని అటు పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: