రింకూని మించినోడే లేడు.. ఈ గణాంకాలు చూస్తే మీరు అదే అంటారు?

praveen
గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో తన విధ్వంసకరమైన ఆట తీరుతో ఒక్కసారిగా తెర మీదకి వచ్చాడు రింకు సింగ్  అప్పటివరకు ఎవరికీ తెలియని ఆటగాడు తన మెరుపు ఇన్నింగ్స్ లతో ఒక్కసారిగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడుగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు రింకు సింగ్. ఈ క్రమంలోనే ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినా   పరుగుల ప్రవాహం పారిస్తూ సిక్సర్ల మోత మోగిస్తూ ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు రింకు.

 ఎన్నో రోజుల నుంచి భారత జట్టును వేధిస్తున్న ఫినిషర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో ప్రతి మ్యాచ్ లో కూడా నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. ఏకంగా అతను క్రీజ్ లోకి వచ్చాడు అంటే చాలు ప్రత్యర్థి బౌలర్లు అందరూ కూడా వణికిపోయే విధంగా అతని బ్యాటింగ్ విధ్వంశాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పటికే పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇటీవలే మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ ఫుల్ మెంబర్షిప్ ఉన్న జట్లలో 10 t20 ఇన్నింగ్స్ ల తర్వాత అత్యధిక స్ట్రైక్ రేట్, సగటు కలిగిన ఆటగాడిగా రింకు అరుదైన రికార్డు నెలకొల్పాడు.

 రింకు సింగ్ తన 10 ఇన్నింగ్స్ లలో 176.07 స్ట్రైక్ రేట్ తో 71.75 సగటుతో ఒక హాఫ్ సెంచరీ సహాయంతో 287 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ 10 ఇన్నింగ్స్ లలో ఆరింట నాటౌట్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇక అతని ఖాతాలో 29 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ గణాంకాలు చూస్తే టి20 ఫార్మాట్లో రింకు సింగ్ ను మించినోడే లేడు అన్నది అర్థమవుతుంది.
రింకూ సింగ్‌ అత్యధిక స్ట్రైక్ రేట్ సగటు కలిగిన ఆటగాళ్లు వీళ్లే..
మిస్బా ఉల్‌ హాక్‌- 135 స్ట్రయిక్‌రేట్‌తో 67.60 సగటు.
డెవాన్‌ కాన్వే- 151 స్ట్రయిక్‌రేట్‌తో 65.43 సగటు.
కేఎల్‌ రాహుల్‌- 151 స్ట్రయిక్‌రేట్‌తో 56.75 సగటు.
ఆండ్రూ సైమండ్స్‌- 170 స్ట్రయిక్‌రేట్‌తో 56.17 సగటు.
బాబర్‌ ఆజమ్‌- 123 స్ట్రయిక్‌రేట్‌తో 54.86 సగటు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: