శివం దూబేఫై అనుమానం.. సిక్సర్లు కొడుతున్నాడని బ్యాట్ చెక్ చేశారు.. చివరికి?

praveen
ఇటీవల టీమిండియాలో అవకాశం దక్కించుకునే ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ ఆట తీరుతో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తమ స్థానాన్ని టీమిండియాలో సుస్థిరం చేసుకునేలాగే కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం భారత జట్టు ఇండియా పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తో  మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది. ఇటీవలే రెండో టి20 మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండో టి20 మ్యాచ్ లో భారత ఆటగాళ్లు వీరవిహారం చేసి అదిరిపోయే విజయాన్ని సాధించారు. ఇక మొదటి మ్యాచ్ లో కూడా టీమిడియా విజయం సాధించడంతో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి  ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా.

 అయితే ఆఫ్గనిస్తాన్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లలో కూడా ఆల్రౌండర్ శివం దూబే ఏకంగా తన బ్యాట్ తో వీరవిహారం చేశాడు. మొదటి మ్యాచ్ లో 60 పరుగులతో అదరగొట్టిన శివం దూబే రెండో మ్యాచ్లో అయితే మరింత విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి. 32 బంతుల్లోనే 63 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లతో చెడుగుడు ఆడేసాడు. ఏకంగా 199.8 స్ట్రైక్ రేటుతో అతను బ్యాటింగ్ చేశాడు అని చెప్పాలి. ఇక అతను ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉండడం గమనార్హం. అయితే ఊహించని రీతిలో శివం దూబే బ్యాటింగ్ విధ్వంసం కొనసాగడంతో అటు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.

 మరీ ముఖ్యంగా ఎంతో కష్టతరమైన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని అల్లడించాడు దూబే. ఈ క్రమంలోనే ఏకంగా శివం దూబే బ్యాటింగ్ చేయడానికి తెచ్చుకున్న బ్యాట్ పై  ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ బ్యాడ్ లో ఏదైనా ప్రత్యేకత ఉందా అని ఏకంగా దూబే చేతుల్లో నుంచి బ్యాట్ తీసుకుని చెక్ చేశారు అని చెప్పాలి. అయితే అదేమీ లేదు అన్నట్లుగా శివం దుబాయ్ నవ్వుతూ ఆఫ్గనిస్తాన్ బౌలర్లకు సమాధానమిచ్చాడు. అయితే ఈ మధ్యకాలంలో భారత ఆటగాళ్ళ బ్యాటింగ్ విధ్వంసం చూసి ఏకంగా ప్రత్యర్ధులు మాత్రమే కాదు ఎంపైర్లు సైతం భారత ఆటగాళ్లు చేతబూనిన బ్యాట్లపై సరదా కామెంట్లు చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: