అదరగొట్టాడు.. ఇక వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయినట్టేనా?

praveen
గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రానించినప్పటికీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి నిరాశపరిచింది టీమ్ ఇండియా. అయితే ఈ ఏడాది జరగబోయే టి20వరల్డ్ కప్ లో తప్పక విజయం సాధించాలని పట్టుదలతో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రపంచ కప్ టోర్నీ కోసం అత్యుత్తమ జట్టును ఎంపిక చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది టీమిండియా. ఇక ఇందుకోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక జూన్ 1వ తేదీ నుంచి ప్రపంచ కప్ ప్రారంభం కాబోతూ ఉండగా.. ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీకి ముందు టీమిండియా ఆడుతున్న ఏకైక టీ20 సిరీస్ అటు ఆఫ్ఘనిస్తాన్తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ కావడం గమనార్హం.

 అయితే ఈ సిరీస్ లో ఆటగాళ్లు ప్రదర్శన ఆధారంగానే వరల్డ్ కప్ టోర్నీలో ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇది దృష్టిలో పెట్టుకున్న ఆటగాళ్లు ఇక ఈ సిరీస్ లో వచ్చిన అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అదిరిపోయే ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఆఫ్గనిస్తాన్తో జరుగుతున్న టి20 సిరీస్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం ఇక అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ఎంతో పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అవుతున్నాడు అక్షర్ పటేల్.

 ఈ క్రమంలోనే అతనికి టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం అని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టుకు అందుబాటులో ఉన్న స్పిన్నర్లు కుల్దీప్, రవి బిష్ణయ్, వాషింగ్టన్ సుందర్ లతో పోల్చి చూస్తే అటు అక్షర పటేల్ ఎంతో బెటర్ అంటూ అభిప్రాయపడుతున్నారు. కాగా ఆఫ్గనిస్తాన్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో 23/2, రెండో టి20 మ్యాచ్ లో 17/2 గణాంకాలతో మంచి ప్రదర్శన చేశాడు అక్షర్ పటేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: