హైదరాబాదులో క్రికెట్ మ్యాచ్.. టికెట్ల విక్రయం ఎప్పటినుంచంటే?

praveen
టీమిండియా జట్టు ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సౌతాఫ్రికా పర్యటనను ముగించుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ లో భాగంగా 2 t20 మ్యాచ్ లు కూడా ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ టి20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ నెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది భారత జట్టు.

 కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు దూసుకు వెళ్ళాలి అంటే ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించడం.. అటు భారత జట్టుకు ఎంతో కీలకం అని చెప్పాలి. అదే సమయంలో గత కొంతకాలం నుంచి బజ్ బాల్ అనే విధానంతో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్ధులపై ఒత్తిడి పెంచుతున్న ఇంగ్లాండ్ సైతం టీమిండియాని వారి సొంత గడ్డమీద ఓడించాలని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటుంది. అయితే ఇక ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్లు కూడా అటు తెలుగు రాష్ట్రాలలో జరుగుతూ ఉండడం గమనార్హం.

 సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువగా అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. దీంతో ఏదైనా మ్యాచ్ జరిగింది అంటే చాలు ప్రేక్షకులు భారీగా స్టేడియం కు తరలి వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మొదటి టెస్ట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. సీజన్ టికెట్ ఐదు రోజులకు 600 గా ఉంది. ఇక ఖరీదైన కార్పోరేట్ బాక్స్ టికెట్ రేటు ఇక మ్యాచ్ జరిగే ఐదు రోజులకు గాను 16 వేల రూపాయలుగా ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: