రోహిత్ మాటల వెనుక.. ఇంత అర్ధం ఉందా?

praveen
దాదాపు 14 నెలల విరామం తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లో మ్యాచ్లు ఆడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. 2022 t20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా పొట్టి ఫార్మాట్లో మ్యాచ్ ఆడలేదు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఆఫ్గనిస్తాన్తో జరుగుతున్న సిరీస్ లు రోహిత్ టి20 మ్యాచ్ లు ఆడుతూ ఉండడంతో.. ఇక అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

 అయితే 2024 t20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇక మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీని t20 ఫార్మాట్లో చేర్చారు అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మరోవైపు ఇంకో చర్చ కూడా జరుగుతూ ఉంది అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి టి20లలో జట్టును నడిపిస్తున్న హార్థిక్ పాండ్యా గాయం బారిన పడి జట్టుకు దూరమవడం ఇక అతని తర్వాత టి20 కెప్టెన్సీ చేపట్టిన సూర్యకుమార్ కూడా ఇటీవల గాయం బారిన పడి జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు.

 ఈ క్రమంలోనే ఇక వేరే ఆప్షన్ లేకపోవడంతో అటు రోహిత్ శర్మ చేతికి మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు తెరదించేలా ఇటీవల రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తు ప్రణాళికల ప్రకారమే తనను కెప్టెన్గా ఎంపిక చేసారు అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ తో చాలా లాభాలు ఉన్నాయి. టి20 ప్రపంచ కప్ వరకు పొట్టి ఫార్మాట్ లో సిరీస్ లేవు. ఇటీవల నేను అంతర్జాతీయ టి20 క్రికెట్ ఆడలేదు. గత ఏడాది వన్డేలు టెస్టులపై పరిమితమయ్యాను. టీ20 లో లేనప్పటికీ రాహుల్ తో ఈ ఫార్మాట్ గురించి చర్చ జరుపుతూనే ఉన్నాను. జట్టుగా మనం ఏం చేయగలము అనే దానిపై మాట్లాడుకుంటూనే ఉన్నాం. వచ్చే ప్రపంచ కప్ వరకు ఉత్సాహాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం అంటూ రోహిత్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: