ఇషాన్ కిషన్ ఇలా చేశాడేంటి.. ఇక జట్టులోకి రావడం కష్టమే?

praveen
ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు ఇషాన్ కిషన్. అయితే రెగ్యులర్ గా భారత జట్టులో చోటు సంపాదించుకోలేకపోయినప్పటికీ ఎవరైనా ఆటగాడు గాయపడ్డాడు అంటే చాలు.. సెలెక్టర్లకు ఇషాన్ కిషన్ మొదటి ఆప్షన్ గా మారిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. వికెట్ కీపర్ గా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా తన సత్తా ఏంటో చూపిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు ఈ క్రికెటర్.

 కాగా ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఆతిథ్య సఫారీ జట్టుతో జరగాల్సిన టెస్టు సిరీస్ కోసం ఎంపికయ్యాడు ఇషాన్ కిషన్.  కానీ ఊహించనీ రీతిలో ఈ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మానసిక అలసట కారణంగా తాను టెస్టు సిరీస్ ఆడలేనని కొన్ని రోజులపాటు విశ్రాంతి కావాలి అంటూ సెలెక్టర్లను కోరాడు. ఇక సెలక్టర్లు ఒప్పుకోవడంతో అతను ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత అతను మళ్ళీ క్రికెట్ మొదలుపెడతాడు అని అందరూ అనుకున్నారు.

 ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ ఆడి మళ్లీ మునుపటి ఫామ్ నిరూపించుకుని భారత జట్టులోకి వస్తాడని ఊహించారు. కానీ ఊహించని రీతిలో అతను రంజీ ట్రోఫీలో కూడా ఆడటం లేదు అని చెప్పాలి. ఏకంగా అతను ఆడాల్సిన రంజీ మ్యాచ్లో కూడా అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇషాన్ కిషన్ మాతో టచ్ లో లేడు. ఆడతాడో లేదో కూడా చెప్పలేదు. ఒకవేళ వస్తే నేరుగా జట్టులో ఆడిస్తాం అంటూ జార్ఖండ్ టీం మేనేజ్మెంట్ తెలిపింది. అయితే అతను రంజీలలో ఆడకపోతే ఇక ఈ నెలలో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి జట్టులోకి ఎంపిక చేయడం కష్టమే అని బీసీసీఐ వర్గాలు తెలిపాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: