వేలకోట్ల ఆస్తులు ఉన్నా.. బన్నీకి ఆ రూ.100 నోటు ఎంతో ప్రత్యేకమట తెలుసా?

praveen
ప్రస్తుతం సౌత్ లో ఉన్న టాప్ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ఇక స్టైలిష్ స్టార్ కాస్త ప్రేక్షకులకు ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక పుష్ప మూవీతో ఏకంగా తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు ఈ హీరో. అయితే ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు 100 కోట్ల పారితోషకం కూడా అందుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే.

 ఇక ఇప్పటికే అటు సినిమాల ద్వారా వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాల ద్వారా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు బన్నీ. అయితే ఇలా వేల కోట్లు ఉన్నప్పటికీ అల్లు అర్జున్కి ఒక వంద రూపాయల నోటు మాత్రం ఎంతో ప్రత్యేకమట. అదేంటి వేల కోట్లు ఉంటే వంద రూపాయల నోటు అంత స్పెషల్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు కదా.. అది తెలియాలంటే పూర్తి వివరాలు తెలియాల్సిందే.. అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ కంటే ముందే అల్లు అర్జున్ కి రాఘవేంద్రరావు వంద రూపాయల నోటుని అడ్వాన్సుగా ఇచ్చాడట.

 గతంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది చిన్నారులను డాన్స్ చేయించేవారు. అలాగే పుట్టినరోజుకి ఎంతో మంది ప్రముఖులను కూడా ఆహ్వానించేవారు. అలా ఓ రోజు చిరంజీవి బర్త్ డే రోజు  ఇంట్లో ఉన్న పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారట. అయితే ఆరోజు అల్లు అర్జున్ కూడా పిల్లలందరితో డాన్స్ చేస్తున్నారట. ఇక ఈ వేడుకకు వచ్చిన రాఘవేంద్రరావు పిల్లలందరి డాన్స్ చూసి ఎంతగానో మురిసిపోయారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అందరికంటే కాస్త డిఫరెంట్ గా డాన్స్ చేయడంతో రాఘవేంద్రరావు ఫిదా అయి ఏకంగా దగ్గరకు పిలిచి మెచ్చుకున్నాడట. అంతేకాదు ఏకంగా అల్లు అర్జున్ తల్లిని పిలిచి మీ కొడుకుని నేనే హీరోగా పరిచయం చేస్తాను వంద రూపాయలు అడ్వాన్స్ తీసుకోండి అని ఇచ్చారట. ఈ విషయాన్ని ఇటీవలే అల్లు నిర్మల కూడా బయటపెట్టింది అని చెప్పాలి. ఇప్పటికి ఆ ₹100 నోట్ ఎంతో భద్రంగా దాచుకుంటాడట అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: