కోహ్లీ.. ఆ విషయంలోనూ నిన్ను మించినోడు లేడు?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు సైతం కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో కోహ్లీ అంటే ఎవరో అందరికీ బాగా తెలిసేలా పరిచయం చేసుకున్నాడు విరాట్. ఏకంగా వరల్డ్ క్రికెట్లో రికార్డుల రారాజుగా కూడా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు కెరియర్ లో ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్ సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి తన పేరిట లికించుకున్నాడు.

 ఇక ఎన్ని పరుగులు చేసిన ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగానే.. ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడుతూ ఉంటాడు. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతో మంది ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ మైదానంలో ఎంత ఎనర్జిటిక్ గా, అగ్రసివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇలాంటి గుణమే అటు ప్రత్యార్థులు కోహ్లీని చూస్తే భయపడేలా చేస్తూ ఉంటుంది. అయితే మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎలా అయితే అగ్ర సీవ్ గా ఉంటాడో మ్యాచ్ ముగిసిన తర్వాత అంతే కూల్ గా కనిపిస్తాడు విరాట్ కోహ్లీ. ఎప్పుడూ సహచరులను ప్రత్యర్థులను ఆటపట్టిస్తూ కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి.

 మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీలో ఎలా అయితే బాధ్యత గల క్రికెటర్ కనిపిస్తాడో.. మ్యాచ్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ లోని చిన్నపిల్లాడు బయటికి వస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కోహ్లీ చేసే చిలిపి పనులు అభిమానులందరికీ హృదయాలను దోచేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల విరాట్ కోహ్లీ మరోసారి తనలోని ఫన్నీ యాంగిల్ ను చూపించాడు. సౌత్ ఆఫ్రికా తో రెండో టెస్టులో టీమిడియా గెలవడంతో 1-1 తో సిరిస్ సమం అయ్యింది. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా, భారత జట్లు ట్రోఫీతో ఫోటోలు దిగాయి. ఆ సమయంలో విరాట్ కోహ్లీ చిన్న పిల్లాడి లాగా ఫోటోకి ఫోజులు ఇవ్వగా.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన అభిమానులు క్రికెట్లోనే కాదు.. ఇలా ఫన్నీగా ఉండడంలోనూ నిన్ను మించినోడు లేడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమానార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: