మాజీ భార్యకు.. అందరి ముందే ముద్దు పెట్టిన స్టార్ హీరో?

praveen
సినీ సెలబ్రిటీల మధ్య ప్రేమాయణం పుట్టడం.. ఇక అది పెళ్లి వరకు వెళ్లడం.. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే చివరికి విడాకులు తీసుకొని వేరుపడటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఇలా ప్రేమ వివాహం చేసుకొని విడిపోయిన వారు ఉన్నారు. అయితే ఒక్కసారి ఇలా విడాకులు తీసుకొని విడిపోయారు అంటే ఒకరి మొఖం ఒకరు చూసుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ఎక్కడైనా ఎదురుపడిన మొఖం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు.  ఇలా విడాకులు తీసుకున్న ఎంతో మందిని చూశాము. కానీ ఇటీవలే విడాకులు తీసుకున్న ఒక సెలబ్రిటీ జంట చేసిన పని మాత్రం అందరిని షాకీ గురి చేసింది.

 బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న అమీర్ ఖాన్.. సినిమాలతో ఎంతలా గుర్తింపును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమాలతో మాత్రమే కాదు ఇక తన పెళ్లిళ్లతో కూడా ఇలాగే గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవల ఏకంగా విడాకులు ఇచ్చిన తన మాజీ భార్య  కిరణ్ రావు ను అందరి ముందే ముద్దు పెట్టుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అమీర్ ఖాన్. ఇటీవల అమీర్ ఖాన్ కూతురు ఐరా  వివాహం జరిగింది. తన ప్రియుడు ఫిట్నెస్ ట్రైనర్ అయిన నువుర్ తో ఈ వివాహం జరగడం గమనార్హం.

 అయితే ఈ వివాహ వేడుకకు ఎంతో మంది అతిరథ మహారధులు హాజరయ్యారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు. కాగా వివాహానికి అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా వచ్చారు. ఆమె తన వెంట కూతురు ఆజాద్ తో కలిసి వచ్చారు. వధూవరులతో కలిసి ఫోటోలు దిగారూ. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన చోటుచేసుకుంది అని చెప్పాలి. ఏకంగా రిసెప్షన్లో మాజీ భార్య కిరణ్ రావును అమీర్ ఖాన్ ప్రేమగా పలకరించి ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాదు అందరి ముందే దగ్గరికి తీసుకొని చెంపపై ముద్దు పెట్టారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: