టెస్ట్ క్రికెట్ పై.. ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు?

praveen
క్రికెట్ అనే ఆటకు ఊపిరిగా నిలిచే టెస్ట్ ఫార్మాట్ రోజు రోజుకు ప్రమాదంలో పడిపోతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అవును అనే సమాధానమే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వరల్డ్ క్రికెట్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్కు పెరిగిపోయిన ఆదరణ నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్ ను చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు. ఇలాంటి సమయంలో ఇక అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా ఉన్న ఎంతోమంది ఆటగాళ్లు ఇక టెస్ట్ ఫార్మాట్ యొక్క ప్రాధాన్యతను తెలియజేసేలా ఇక మిగతా ఫార్మాట్లను దూరం పెట్టి మరి టెస్ట్ ఫార్మాట్లో పాల్గొంటూ ఉండడం చూస్తూ ఉన్నాం.

 అయితే రోజు రోజుకు ఇలా సాంప్రదాయ క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్ కు ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. టెస్ట్ క్రికెట్ ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరు కాస్త ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు ఇక దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది. సాదరణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఎక్కువగా అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్సులు ఇస్తూ ఉంటారు. కానీ టెస్ట్ ఫార్మాట్ అంటే మాత్రం సీనియర్లకు పెద్దపీట వేస్తూ ఉంటాయి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు.

 కానీ ఇటీవలే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం విచిత్రంగా వ్యవహరించింది. ఏకంగా న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన టీంతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఏకంగా జట్టులో ఏడుగురు అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కి అవకాశం కల్పించింది. దీంతో ఇక ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఎంతోమంది క్రికెటర్లు స్పందిస్తూ ఉన్నారు. ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక టెస్ట్ క్రికెట్ ప్రేమికుడిగా అందరు టెస్టులను చూడాలని కోరుకుంటున్న అంటూ చెప్పుకొచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్ చూస్తూనే పెరిగాను. సౌత్ ఆఫ్రికా తమ పూర్తి స్థాయి జట్టును పంపించలేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు కమిన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: