రేపే రెండో టెస్ట్ మ్యాచ్.. భారత్ ను భయపెడుతున్న రికార్డులు?

praveen
భారత జట్టు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో సిరీస్ లు ఆడుతుంది  అయితే ప్రస్తుతం టెస్టు సిరీస్ లో భాగంగా ఆతిథ్య సఫారీ జట్టుతో తలబడుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో అటు భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే  అయితే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేదు టీమిండియా.

 అయితే ఈసారైనా రోహిత్ కెప్టెన్సీలో ఆ నిరీక్షణ కు తెరపడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు మొదటి మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురయింది అని చెప్పాలి. 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ క్రమంలోనే భారత జట్టు ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్ లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.  ఇక రెండో మ్యాచ్ లో మాత్రం తప్పక గెలవాలని ఆశపడుతుంది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా తీవ్రంగా చెమటోడుస్తున్నారు అని చెప్పాలి.

 అయితే ఇక దక్షిణాఫ్రికా తో రెండో టెస్ట్ కి ముందు అటు భారత జట్టును పలు రికార్డులు భయపెడుతూ ఉన్నాయి. ఈ రెండో టెస్ట్ మ్యాచ్ కేఫ్ టౌన్ వేదికగా జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇప్పటివరకు ఏకంగా 6 మ్యాచ్లు ఆడిన భారత జట్టు నాలుగు మ్యాచ్లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్లు డ్రాగా ముగిసాయి అని చెప్పాలి. దీన్నిబట్టి ఇక ఈ వేదికలో ఒక సారి కూడా విజయం సాధించలేదు టీమిండియా. అదే సమయంలో ఇక ఈ గ్రౌండ్లో భారత్ అత్యల్ప స్కోరు 135 కాగా అత్యధిక స్కోరు 414 గా ఉన్నాయి. మరి రేపు జరగబోయే టెస్ట్ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: