వారెవ్వా.. కోహ్లీనా మజాకా.. అవార్డు వచ్చేసింది?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏకంగా అందరి లాగానే ఒక సాదాసీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అతి తక్కువ సమయంలోనే తాను చరిత్రలో నిలిచిపోయి ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. ఎంతో మంది లేజెండరీ క్రికెటర్స్ సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బద్దలు కొట్టి తన పేరిట లికించుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్.

 అంతేకాదు అతని తరానికి అతన్ని మించిన లెజెండ్ మరొకరు లేరు అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు అని చెప్పాలి. ఇక నేటి తరంలో ఎంతోమంది సార్ ప్లేయర్లు ఉన్న విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులతో పోల్చి చూస్తే అందరూ అతనికి కాస్తైనా దగ్గరలో కూడా లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక ఎన్ని రికార్డులు సాధించిన ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్నట్లుగానే ప్రతి మ్యాచ్లో కూడా బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక కోహ్లీలోని ఇలాంటి ఆట తీరే అతని అందరిలో కెల్లా ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే కెరియర్ లో ఎన్నో అరుదైన అవార్డులను దక్కించుకున్న విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మకమైన అవార్డు రేసులో నిలిచాడు ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నిందిస్తాడు. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి తో ఫైనల్ పోరులో ఉన్నాడు కోహ్లీ. ఈ అవార్డు కోసం వందల మంది క్రీడాకారులు పోటీ పడగా కోహ్లీ, మెస్సి మాత్రమే తుది దశకు చేరుకున్నారు. రోనాల్డో, మహమ్మద్ అలీ, మైఖేల్ జోర్డాన్ వంటి దిగ్గజ ఆటగాళ్ళను దాటుకుని కోహ్లీ ఫైనల్ దశకు చేరుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఫుట్బాల్ దిగ్గజం మెస్సి నీ దాటుకుని అవార్డును దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: