విజయానందంలో ఉన్న సౌతాఫ్రికాకు.. ఊహించని షాక్?
రెండు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఇటీవల డిసెంబర్ 26వ తేదీన జరిగింది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా భారీ విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఏకంగా భారత జట్టును 31 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడించింది. సౌత్ ఆఫ్రికా దీన్ని బట్టి ఇక ఆ జట్టు ఎంత అత్యుత్తమమైన ప్రదర్శన చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక ఎన్నో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వెస్టిండీస్ గడ్డపై సఫారీ జట్టుకు షాక్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు అని చెప్పాలి. ఇలా తొలి టెస్ట్ లో విజయం సాధించి సంబరాల్లో ఉన్న సౌతాఫ్రికాకు ఒక ఊహించని షాక్ విషయం తగిలింది
సఫారీ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న తెంప భావమా ఇక అటు రెండో టెస్టు మ్యాచ్ కి అందుబాటులో ఉండబోడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 185పరుగులు చేసి సెంచరీ తో చెలరేగిపోయిన డీన్ ఎల్గర్ ఇక జట్టు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించబోతున్నాడట. అయితే తొలి టెస్ట్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా గాయం బారిన పడ్డారు. అయితే అతను కోలుకొని మళ్ళీ రెండో టెస్టులకు అందుబాటులోకి వస్తాడు అనుకున్నప్పటికీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చివరికి రెండో టెస్టుకు దూరమయ్యారు అని చెప్పాలి.