ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరని.. వాళ్లు డిసైడ్ చేయడమేంటి : గంభీర్

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగి ఇక ఫలితం వచ్చిన తర్వాత ఇక ఆ మ్యాచ్ లో అత్యుత్తమమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రొఫెషనల్ క్రికెట్లో ప్రతి మ్యాచ్ లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకోవాలని అందరూ ఆటగాళ్లు కూడా ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ అత్యుత్తమమైన ప్రతిభను కనబరిచినందుకు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కేవలం ఎవరో ఒక్కరికి దక్కుతుంది. కాబట్టి ఇక అదృష్టవంతులు ఇక ఈ అవార్డును దక్కించుకుంటూ ఉంటారు. అయితే కేవలం ఆ మ్యాచ్ కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన వారి అభిప్రాయం ప్రకారమే ఇక ఇప్పటివరకు ప్రొఫెషనల్ క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను ఎవరికి ఇవ్వాలి అంటూ డిసైడ్ చేయడం జరుగుతూ వస్తుంది. అయితే ఇలా చేయడంపై గత కొంతకాలం నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఇటీవలే భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్  చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. కేవలం వ్యాఖ్యాతలు ఎవరిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుంటారు అన్న విషయాన్ని డిసైడ్ చేయకూడదు అంటూ గౌతమ్ పేరు చెప్పుకొచ్చాడు. ఇది పక్షపాతానికి దారి తీయొచ్చు అంటూ తెలిపాడు. తాను ఒకవేళ కామెంటెటర్  ఉన్నప్పటికీ ఈ విధానాన్ని రద్దు చేయాలని గంభీర్ డిమాండ్ చేశాడు. అయితే ఆయా క్రికెట్ మ్యాచ్ లో ఓడిన జట్టు కెప్టెన్ లేదా కోచ్ ఇలా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును  ప్రకటిస్తే బాగుంటుంది ఇది సరైన పద్ధతి అని భావిస్తున్నాను అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: