మొదటి టెస్టులో ఓటమి.. అతను లేని లోటు కనబడుతుందన్న దినేష్ కార్తీక్?

praveen
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు అక్కడ మూడు ఫార్మాట్లలో సిరీస్ లు ఆడుతుంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మట్లలో సిరీస్ లను ముగించుకుంది టీమిండియా. టి20 ఫార్మాట్ ను సమం చేయడంతో పాటు ఇక వన్డే ఫార్మాట్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే అదే జోరును ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగే టెస్ట్ సిరీస్ లో కూడా భారత జట్టు చూపిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురయింది.


 ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 31 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టు ఘోర పరాభావాన్ని చవిచూసింది. ఒకవైపు భారత బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలం అవ్వగా అటు బౌలింగ్ విభాగం కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ క్రమంలోనే చివరికి మొదటి టెస్ట్ మ్యాచ్లో అటు భారత జట్టుకు ఓటమి తప్పలేదు అని చెప్పాలి. ఏకంగా టీమిండియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా తడబడిన పిచ్ పై సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు మాత్రం పరుగుల వరద పారించారు అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డీన్ ఎల్గర్ 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేసి త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు.


 మహమ్మద్ సిరాజ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న పరుగులు మాత్రం కట్టడి చేయలేకపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే జట్టులో మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అంటూ అటు వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. మహమ్మద్ షమి ఉంటే సౌత్ ఆఫ్రికా ఎప్పుడో ఆల్ అవుట్ అయ్యేది అంటే అభిప్రాయపడ్డాడు. మహమ్మద్ షమీ తన స్వింగ్ బౌలింగ్ తో కేవలం ఒక బౌలర్ గా మాత్రమే కాదు లీడర్గా ఎదిగాడు. బుమ్రాకు అతను సరైన జోడి అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. పిచ్ పై సీమ్ తో రెండువైపులా షమీ బంతిని స్వింగ్ చేసి ఉంటే సఫారీ బ్యాటర్లకు చుక్కలు కనబడేవి. టీమ్ ఇండియా నిజంగా అతన్ని మిస్ అవుతుంది అంటూ తెలిపాడు దినేష్ కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: