ఆదాయంలో కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది కుల్దీప్ టాప్?

praveen
అయితే ప్రస్తుతం భారత క్రికెట్ లో ఆటగాళ్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా ఇక ఇండియన్ క్రికెట్లో ప్రతి ఏడాది ఎక్కువ సంపాదించే క్రికెటర్లు ఎవరు అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేరు చెబుతూ ఉంటారు. వీరిద్దరూ ఐపీఎల్ తో పాటు బ్రాండ్ ప్రమోషన్స్ ఇక మ్యాచ్ ఫీజుల విషయంలో కూడా మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే ఎక్కువగానే సంపాదిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఈ ఇద్దరు క్రికెటర్లు ఛార్జ్ చేసేది కోట్లలోనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ ఏడాది ఈ ఇద్దరు సీనియర్ పాపులర్ క్రికెటర్లను దాటేసి మరో భారత క్రికెటర్ ఎక్కువ ఆదాయం సంపాదించాడట.


 అతను ఎవరో కాదు టీం ఇండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. అదేంటి అతను ఎక్కడ వాణిజ్య ప్రకటనల్లో కనిపించడమే లేదు  ఇక వీరిద్దరి కంటే ఎలా ఎక్కువ సంపాదిస్తాడు అంటారా.. వాణిజ్య ప్రకటనల విషయంలో కాదు మ్యాచ్ ఫీజుల విషయంలో కోహ్లీ, రోహిత్ కంటే అతనే ఎక్కువ ఆదాయం పొందాడు అని చెప్పాలి. కేవలం అతడు వన్డే మ్యాచ్ల ఫీజుల ద్వారా సంపాదించే ఆదాయం మాత్రమే ఈ ఇద్దరు క్రికెటర్ల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇలా టీమ్ ఇండియా తరఫున ఈ ఏడాది వన్డేలలో ఆడిన  మ్యాచ్ ఫీజుల ద్వారా అత్యధిక ఆదాయం సంప్రదించిన ప్లేయర్ల లిస్టులో కుల్దీప్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.


 అయితే ఈ ఏడాది మొత్తంగా కుల్దీప్ యాదవ్ ఏకంగా 30 వన్డే మ్యాచ్లు ఆడాడు  ఈ క్రమంలోనే ఈ 30 వన్డేలకు గాను మ్యాచ్ ఫీజుగా 1.80 కోట్ల రూపాయలు సంపాదించాడు. అయితే వన్డే ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కు ఒక్కో ఆటగాడికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సంవత్సరం అందరికంటే ఎక్కువ వన్డే మ్యాచ్ లు ఆడిన కుల్దీప్ యాదవ్ 49 వికెట్లు తీశాడు. అంతేకాదు ఇక వన్డేలలో మ్యాచ్ ఫీజును కూడా అందరికంటే ఎక్కువ సంపాదించాడు అని చెప్పాలి. అయితే ఇక ఈ లిస్టులో టీమిండియా యంగ్ ఒపెనర్ శుభమన్ గిల్ మ్యాచ్ ఫీజు ద్వారా అత్యధిక ఆదాయం సంపాదించిన క్రికెటర్ గా రెండో స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: