61 బంతుల్లో సెంచరీ.. సెలక్టర్లకు సవాల్ విసురుతున్న సర్ఫరాజ్ ఖాన్?
అలాంటి సర్ఫరాజ్ ఖాన్ ను అటు సెలెక్టర్లు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక ప్రతిసారి కూడా అతనికి టీమిండియాలో చోటు దక్కుతుందని అనుకున్నప్పటికీ ఇక నిరాశ ఎదురవుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిట్నెస్ లేకపోవడం కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ ను సెలెక్టర్లు టీమిండియాలోకి ఎంపిక చేయడం లేదు అంటూ కొన్ని వార్తలు కూడా తెరమీదికి వచ్చాయి. ఇక సర్ఫరాజ్ ఖాన్ విషయంలో సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై పలువురు మాజీలు విమర్శలు కూడా చేశారు. అయితే ఇటీవల సర్ఫరాజ్ ఖాన్ మరోసారి అదరగొట్టేసాడు. ఏకంగా 61 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.
ఇలా అదిరిపోయే ఇన్నింగ్స్ తో మరోసారి భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు ఈ యంగ్ బ్యాట్స్మెన్. దక్షిణాఫ్రికా తో భారత జట్టు ఆడబోయే టెస్ట్ సిరీస్ కు తనను ఎంపిక చేయాలని తన ఇన్నింగ్స్ తో చెప్పకనే చెప్పాడు. దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య డిసెంబర్ 26వ తేదీ నుంచి కూడా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలని అటు భారత జట్టు పట్టుదలతో ఉంది అని చెప్పాలి. అయితే కనీసం ఇక ఈ మ్యాచ్ లో అయినా తనకు అవకాశం దక్కుతుందేమో అని సర్ఫరాజ్ ఖాన్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పటికైనా ఈ పరుగుల వీరుడికి సెలెక్టర్లు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.