టి20 వరల్డ్ కప్ లో.. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
అయితే ఈ రెండు దేశాల మధ్య కేవలం ఆటలో మాత్రమే కాదు సరిహద్దుల మధ్య కూడా వైరం కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన కూడా హై వోల్టేజ్ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఇక ఈ ఏడాది ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీల ద్వారా ఒకటికి రెండుసార్లు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం అందరికీ దక్కింది. ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుండగా.. ఈ టోర్నీ లోను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది అని చెప్పాలి.
ఇక ఈ మ్యాచ్ కోసం అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2024 t20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఏ రోజు జరగబోతుంది అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగానే ఉన్నారు. కాగా వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ జట్టు ఒకే గ్రూపులో ఉండనున్నట్లు క్రికెట్ వర్గాల నుంచి సమాచారం అయితే న్యూయార్క్ లో జూన్ 8 లేదా 9వ తేదీన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతుందట. ఇండియా ఆడే మ్యాచ్లను దాదాపుగా యూఎస్ లోనే పెట్టాలని ఇండియా ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు సమయం వీలుగా ఉండాలి అనే ఆలోచనలో అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉన్నట్లు తెలుస్తోంది.