అన్న కోసం కిడ్నీ దానం చేసిన మహిళ.. కానీ ఆమె భర్త ఏం చేశాడంటే?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా  ఉంటుంది. మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా  భార్యాభర్తల బంధం అనేది ఎంతో గొప్ప బంధంగా కొనసాగుతుంది  వివిధ మతాల ప్రకారం కూలాల ప్రకారం పెళ్లి జరిగిన.. ఇక వైవాహిక బంధం లో మాత్రం భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఆప్యాయతలు ఒకే విధంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అయితే కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ భార్యాభర్తలు ఇకకలకాలం ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం వైవాహిక బంధం లో భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు.


 ఏకంగా వైవాహిక బంధాన్ని ఎలా తెంపుకోవాలి అని ఆలోచిస్తున్న వారే తప్ప.. ఇక ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాను జనాలే ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పాలి. వెరసి నేటి రోజుల్లో పెళ్లైన కొన్ని రోజులకే ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్న భార్యాభర్తలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక కొంతమంది అయితే కట్టుకున్న వారిపై కోపంతో దారుణంగా కడ తీరుస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొంతమంది ఏకంగా చిన్నచిన్న కారణాలకే కట్టుకున్న భార్యలకు త్రిపుల్ తలాక్ చెప్పి అటు విడాకులు ఇచ్చేస్తున్నారు. త్రిబుల్ తలాక్ ని 2019లోనే ప్రభుత్వం రద్దు చేసింది   అయినప్పటికీ కొంతమంది మాత్రం ఈ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.


 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సోదరునికి కిడ్నీ దానం చేసింది మహిళ. కానీ ఆమెకు ఊహించని చేదు అనుభవం ఎదురయింది. ఈ విషయం భర్తకు చెప్పగానే అతను మొబైల్ లో తలాక్ చెప్పాడు. ఈ ఘటన యూపీలోని బైరి యాగి గ్రామంలో వెలుగు చూసింది. చావు బతుకులో ఉన్న సోదరుడి కోసం బాధితురాలు కిడ్నీ ధానం చేసింది. విషయం తెలిసిన సౌదీలో ఉన్న భర్త ఏకంగా మొబైల్ లోని త్రిబుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: