నా ఫేవరెట్ క్రికెటర్లు వాళ్లే.. ధోని పేరు చెప్పని రుతురాజ్?
అయితే ఈ ఒక్క ఏడాదిలోనే భారత జట్టులోకి 21 మందికి పైక యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు అంటే ఇక ఇండియన్ క్రికెట్లో కుర్రాళ్ళ హవా ఎంతలా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక ఇటీవల కాలంలో ఇలా భారత జట్టులోకి వచ్చిన ఆటగాళ్ళలో తమ ప్రదర్శనతో తామే ఫ్యూచర్స్ స్టార్స్ అనే నిరూపించుకున్న ప్లేయర్లు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో ఇక భారత జట్టులో ఓపెనర్ గా కొనసాగుతున్న రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒకరు అని చెప్పాలి. గతంలో దేశవాలి క్రికెట్లో అదరగొట్టిన ఈ క్రికెటర్ ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడి ఇక ధోని కెప్టెన్సీ లో మరింత రాటు తేలాడు.
మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ సెలెక్టర్లు చూపును ఆకర్షించాడు. ఈ క్రమంలోనే భారత సీనియర్లు విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా ఇతనికి కూడా టీమిండియాలో చోటు దక్కుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఋతురాజ్ గైక్వాడ్. తన ఫేవరెట్ క్రికెటర్లు ఎవరు అన్న విషయాన్ని పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా సచిన్, ధోని, విరాట్ కోహ్లీలను చూస్తూ పెరిగాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ళలో విరాట్, విలియంసన్, ఎ బి డివిలియర్స్ నా ఫేవరెట్ అంటూ తెలిపాడు రుతురాజు గైక్వాడ్. క్రికెట్ లో ఎన్ని షాట్లు ఉన్న కవర్డ్రైవ్ అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.