ఎవరీ సమీర్ రిజ్వి.. ధోని ఎందుకు ఇంత ధర పెట్టాడు?

praveen
మహేంద్ర సింగ్ ధోని ప్రతి విషయంలోనూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి సమర్థవంతుడైన వ్యూహకర్త కాబట్టే కెప్టెన్ గా ఆ రేంజ్ లో సక్సెస్ అయ్యాడు. భారత జట్టుకు ఏకంగా రెండుసార్లు వరల్డ్ కప్ అందించగలిగాడు. అయితే ఐపీఎల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా అటు మహేంద్ర సింగ్ ధోని ఎంత సూపర్ సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 కాగా ధోని లాంటి ఒక వ్యూహకర్త జట్టులోకి ఎవరైనా ప్లేయర్ ను తీసుకున్నాడు అంటే ఇక ఈ నిర్ణయం వెనుక ఎన్ని గణాంకాలు వేసుకొని ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ ను ధోని జట్టులోకి తీసుకున్నాడు. అది కూడా మిగతా ఫ్రాంచైజీ లతో పోటీపడి మరి 8.4 కోట్ల ధర పెట్టి జట్టులో చేర్చుకున్నాడు. దీంతో ధోని అతన్ని ఇంత ధర పెట్టి చేర్చుకోవడానికి గల కారణం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అతను ఎవరో కాదు యంగ్ ప్లేయర్ సమీర్ రిజ్వి.


 మరి ధోనిని ఆకర్షించేంతల అతని గణాంకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. 20 ఏళ్ల సమీర్ రిజ్వి ఉత్తరప్రదేశ్ కు చెందిన యంగ్ ఆల్ రౌండర్. ఇటీవల జరిగిన యూపీ20 లీగ్ లో 9 ఇన్నింగ్స్ లలో 135 స్ట్రైక్ రేట్ తో రెండు సెంచరీలు సహా మొత్తంగా 450 పరుగులు చేశాడు. ఎంతో అలవోకగా భారీ సిక్సర్లు కొట్టడంలో.. ఇతను దిట్ట అని చెప్పాలి. ఇక అండర్ 23 టోర్నమెంట్ లోను 37 సిక్సర్లు టి20 క్రికెట్లో 38 సిక్సర్లు ముస్తాక్ అలీ ట్రోఫీలో 17 సిక్సర్లు కొట్టి అదరగొట్టాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఒత్తిడి లేకుండాఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి గణాంకాలే  ఇక దిగ్గజ కెప్టెన్ ధోనిని ఆకర్షించాయి అన్నది తెలుస్తుంది. అందుకే అతన్ని భారీ ధర పెట్టి చెన్నై సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: