డ్రెస్సింగ్ రూమ్ కి మోడీ రావడంపై.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు?

praveen
నవంబర్ 19వ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. అప్పటివరకు సెమి ఫైనల్ వరకు జరిగిన పది మ్యాచ్లలో కూడా ఒక ఓటమి లేకుండా దూసుకు వచ్చిన భారత జట్టు.. ఇక ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా ముందు తడబడింది అని చెప్పాలి. దీంతో టైటిల్ గెలవలేకపోయింది. అయితే తప్పకుండా టైటిల్ గెలుస్తుంది అనుకున్న జట్టు ఓడిపోవడంతో 140 కోట్ల మంది భారత ప్రజలందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.

 అయితే ఇలా క్రికెట్ ని టీవీలలో లేదా మైదానంలో చూసిన ప్రేక్షకులే మ్యాచ్ ఓడిపోయినందుకు ఇంతలా నిరాశలో మునిగిపోతే 10 మ్యాచ్ల పాటు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ వీరోచిత పోరాటం చేసిన భారత జట్టులోని ఆటగాళ్లు ఇంకెంతల బాధపడి ఉంటారో.. మాటల్లో వర్ణించడం కూడా కష్టమే. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు.. కూడా సోషల్ మీడియాలోకి వచ్చి అభిమానులను మరింత బాధపెట్టాయి. ఇండియా ఆటగాళ్లు అందరూ ఇలా నిరాశలో ఉన్న సమయంలో.. ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియా.. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఆటగాళ్లకు ధైర్యం చెప్పాడు.

 ఈ క్రమంలోనే ప్రధాని రాకతో తమకు ఎంతో మనోధైర్యం  వచ్చింది అంటూ అటూ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై టీం ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా స్పందించాడు. అతిపెద్ద టోర్నిలో ఫైనల్ ఓడిపోతే డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. దేశ ప్లేయర్లందరూ కూడా డౌన్ లో ఉన్న సమయంలో.. ప్రధాన నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి డ్రెస్సింగ్ రూమ్ కి రావడం గొప్ప విషయం. ఎందుకంటే అది ఆటగాళ్లలో మనోస్థైర్యాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది అంటూ రవి శాస్త్రి చెప్పుకుచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: