నేడే తొలి టి20.. టీమిండియా ప్రతికారం తీర్చుకుంటుందా?

praveen
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ గురించి క్రికెట్ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి సొంత గడ్డపై వరల్డ్ కప్ టైటిల్ ఎగరేసుకు పోతుంది అని అందరూ అనుకున్నారు. ఇక అప్పటికే లీక్ దశలో ఓసారి ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది టీమిండియా. దీంతో మరోసారి ఇదే రిపీట్ అవుతుందని అందరూ భావించారు.


 కానీ ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను దెబ్బ కొట్టింది ఆస్ట్రేలియా. అద్భుతంగా రానిస్తుంది అనుకున్న టీమిండియా తడబడింది. దీంతో ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు.. అటు టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఫైనల్ లో ఓడించి నిరాశ మిగిల్చిన ఆస్ట్రేలియా తో ఇక ఇప్పుడు సొంత గడ్డమీద టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. నేటి నుంచి ఈ టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి టి20 మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.



 ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియాను ఇప్పుడు టి20 సిరీస్ లో ఓడించి ద్వైపాక్షిక సిరీస్ కైవసం చేసుకుని ఇక ఎదురుదెబ్బ కొట్టాలని టీమిడియా భావిస్తూ ఉంది.  ఈ టి20 సిరీస్ లో భాగంగా సీనియర్ క్రికెటర్లు అందరికీ కూడా విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. దీంతో ఇక సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో  టీమిండియా బరిలోకి దిగిపోతుంది. సూర్య కుమార్కు డిప్యూటీగా రుతురాజ్ వ్యవహరించబోతున్నాడు. ఇక ఎంతోమంది యంగ్ ప్లేయర్లు కూడా భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: