వావ్.. భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్?

praveen
ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్నిలో టైటిల్ గెలుస్తుంది అనుకున్న టీమ్ ఇండియాకు చివరికి నిరాషే మిగిలింది  అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో ఎంతో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడటానికి సిద్ధమయింది . రేపటి నుంచి ఈ టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది.



 అయితే తొలి టీ20 మ్యాచ్ అటు విశాఖలో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి20 మ్యాచ్  ప్రేక్షకులు అందరికీ మరింత ప్రత్యేకంగా మార్చే విధంగా ఇక వైజాగ్ బీచ్ లో కూడా పెద్ద పెద్ద ప్రత్యేకమైన స్క్రీన్లను ఏర్పాటు చేస్తాము అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రేపు విశాఖలో జరగబోయే టి20 మ్యాచ్ కి అటు వర్షం ఉప్పు ఉంది అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరంలో ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.


 దీంతో విశాఖ వేదికగా జరగబోయే మ్యాచ్ సజావుగా జరుగుతుందా లేదా అని ఎంతమంది ఆందోళన చెందారు. అయితే ఈ విషయంలో భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అందింది అని చెప్పాలి. ఐదు టి20 లో భాగంగా రేపు విశాఖలో జరగబోయే తొలి టి20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడుతూ ఉండగా.. అటు వైజాగ్ లో మాత్రం వర్షం గండం లేదని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అయితే అటు వరల్డ్ కప్ లో ఓడించిన ఆస్ట్రేలియాను సవాల్ చేసేందుకు సీనియర్లు లేని టీమిండియా బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: