టీమిండియా ఓటమి.. టీవీ పగలగొట్టిన అభిమాని?

praveen
సాధారణంగా సినిమాల్లో ఉండే సన్నివేశాలు నిజజీవితంలో జరగడం అసాధ్యం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం సినిమాల్లో కాదు ఏకంగా నిజ జీవితంలోనే అంతకుమించి అనే రేంజ్ లో ఉండే ఘటనలు జరుగుతున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో ఏకంగా నటీనటులు క్రికెట్ చూసే సన్నివేశాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ టీమిండియా ఓడిపోయింది అంటే కోపంతో ఏకంగా టీవీని బద్దలు కొట్టడం లేదంటే ఇంకేదైనా చేయడం చేస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో ఒకవేళ టీమిండియా ఓడిపోతే అయ్యో ఓడిపోయామే అని బాధపడటం తప్ప టీవీను బద్దలు కొట్టడం లేదా చేతిలో ఉన్న ఫోన్ ని కూడా గోడకేసి లాగి కొట్టడం లాంటివి చేయడం దాదాపుగా చేయరు.

 ఎందుకంటే ఇలా చేస్తే మళ్లీ ఆ టీవీని, మొబైల్ ని మనమే బాగు చేయించాలి. దాని కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఎంత కోపం వచ్చినా కూడా కాస్త కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. బాధతో ఏం చేయాలో తెలియక చివరికి వరల్డ్ కప్ మ్యాచ్ చూసిన టీవీనే పగలకొట్టేసాడు. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా ఓడిపోయింది. దీంతో వరల్డ్ కప్ టైటిల్ గెలవాలనే 140 కోట్ల భారత ప్రజల కలగానే మిగిలిపోయింది.

 ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ పోరులో టీమ్ ఇండియా గెలుస్తుందని అటు అభిమానులు అందరూ కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. చివరికి భారత్ ఓడిపోవడంతో ఈ పరాజయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఏకంగా లీగ్, సెమి ఫైనల్లో ప్రత్యర్థులపై అలవోకగా.. గెలిచిన టీమిండియా ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియాపై చిత్తుగా ఓడిపోవడంతో చాలామంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారూ. ఇంకొంతమంది మాత్రం ఏడవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా బాధపడిపోయారు. అయితే విన్నింగ్ షాట్ ఆడిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు సంబరాలు చేసుకోవడాన్ని ఒక అభిమాని చూడలేకపోయాడు.  ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఏకంగా టీవీని పగలగొట్టేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: