ట్రావీస్ హెడ్ గురించి.. షేన్ వార్న్ అప్పుడే చెప్పేశాడుగా?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో అలరిస్తూ వచ్చిన వరల్డ్ కప్ టోర్నికీ ఇటీవల ఎండ్ కార్డు పడింది అన్న విషయం తెలిసిందే. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరికి అటు భారత జట్టు ఒత్తిడికి తలవంచితే ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఫైనల్ లో తమకు 8సార్లు ఆడిన అనుభవం ఉండడంతో ఇక ఎంతో అద్భుతంగా రాణించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక టైటిల్ విజేతగా నిలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.

 భారత బ్యాట్స్మెన్లు అందరూ కూడా పరుగులు చేయడానికి ఎంతో ఇబ్బంది పడిన మైదానంలో.. అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు మాత్రం ఎంతో నిలకడగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాల వైపుకు నడిపించారూ. మరి ముఖ్యంగా అటు భారత జట్టు ఓపెనర్ గా కొనసాగుతున్న ట్రావీస్ హెడ్ అయితే తన బ్యాటింగ్ తో ఏకంగా అటు భారత జట్టు ఓటమిని శాసించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే పరుగులు చేయడమే కష్టం అనుకున్న పిచ్ పై ఏకంగా సెంచరీ తో చలరేగిపోయాడు ట్రావీస్ హెడ్. ఇక భారత బౌలర్లు ఎన్ని వైవిధ్యమైన బంతులు సందించిన అతను మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.

 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావీస్ హెడ్ గురించి ఒక ఆసక్తికర న్యూస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దివంగత ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్.. వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావీస్ హెడ్ భవిష్యత్తు గురించి 2016 లోనే సరైన అంచనా వేశాడు. నేను ట్రావీస్ హెడ్ కు వీరాభిమానిని.. అతడు అన్ని ఫార్మాట్లలో రానించి ఆస్ట్రేలియా ఫ్యూచర్స్ స్టార్ అవుతాడు అని 2016 లోనే షేన్ వార్న్ పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. కథ ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు ట్రావీస్ హెడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: