మహేష్ బాబు ఫైనల్ చూడటానికి వెళ్ళారా.. కప్పు గెలుస్తాం?

praveen
క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూసిన మహా సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో ఇక వరల్డ్ కప్ లో భాగంగా ఫైనల్ పోరు జరగబోతుంది. ఏకంగా దేశ విదేశాల నుంచి ఈ ఉత్కంఠ భరితమైన పోరును వీక్షించేందుకు ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు అహ్మదాబాద్ చేరుకున్నారు. ఇక నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పొందాలని భావిస్తున్నారు. అయితే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అని ఏర్పాట్లు చేసుకున్నారు అని చెప్పాలి.


 ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఈ ఫైనల్ సమరం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ రెండు టీమ్స్ లో టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఎన్నో రోజుల నుంచి భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ టైటిల్ ఇక ఇప్పుడు సొంత గడ్డమీద జరుగుతున్న.. ప్రపంచకప్ టోర్నీలో తప్పకుండా సొంతమవుతుంది అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక భారత్ గెలవాలంటే కొన్ని సెంటిమెంట్స్ రిపీట్ కావాలి అంటూ ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 అయితే నేడు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో.. అటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. అదేంటి ఫైనల్ మ్యాచ్ తో మహేష్ బాబుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా. ధోని కెప్టెన్సీలో 2011 వరల్డ్ కప్ టీమ్ ఇండియా ఆడిన సమయంలో ఇక మహేష్ బాబు, నమ్రత నేరుగా స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షించారు. ఆ సమయంలో భారత జట్టు టైటిల్ గెలిచింది. దీంతో ఇప్పుడు కూడా ఈ జంట మళ్ళీ స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షించాలని.. దీంతో పాత సెంటిమెంట్ రిపీట్ అయ్యి మళ్లీ పాజిటివ్ ఫలితమే వస్తుందని ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: