
ఫైనల్ కోసం.. రెండేళ్ల క్రితమే ప్రిపరేషన్ మొదలుపెట్టాం : రోహిత్
ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇక అటు సెమీఫైనల్ లో కూడా ఎప్పుడు గెలవని న్యూజిలాండ్ పై విజయం సాధించి.. ఒక చిరస్మరణనీయమైన గెలుపును సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నేడు ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలబడిపోతుంది. ఇక ఈ మెగా పోరు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా వరల్డ్ కప్ టోర్ని కోసం గత రెండేళ్ల క్రితమే ప్రిపరేషన్ మొదలుపెట్టాం అంటూ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.
ఈరోజు కోసమే మేమంతా రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. నేను వన్డే వరల్డ్ కప్ చూస్తూ పెరిగాను. నేను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయి ఉన్నప్పుడే.. ఈ వరల్డ్ కప్ కోసం మేమంతా ప్రిపరేషన్ మొదలుపెట్టాం. మా బాధ్యతల విషయంలో స్పష్టతతో ఉన్నాం అంటూ రోహిత్ తెలిపారు. కోచ్ ద్రావిడ్ కోసం మేము ఈ వరల్డ్ కప్ లో టైటిల్ గెలవాలనుకుంటున్నాం. అయితే ఫైనల్ ఏ చిన్న తప్పిదం చేసిన ఇప్పటివరకు గెలిచిన.. పది మ్యాచ్ లు కూడా వృధానే అవుతాయి అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.