భారత్ వరల్డ్ కప్ గెలిస్తే.. రూ. 100 కోట్లు పంచేస్తాను?
కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లు వచ్చేసరికి మాత్రం ఎందుకో ఒత్తిడికి చిత్తవుతూ భారత జట్టు ఓటమితో నిరాశపరిచి ఇంటి బాటపడుతూ వస్తుంది. ఇక 2019 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు అస్సలు మరిచిపోలేదు అని చెప్పాలి. రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి ఇక కప్పు గెలిచి చిరస్మరణీయమైన వీడ్కోలు ఇవ్వాలి అనుకున్న.. అది సాధ్యపడలేదు. దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా తెగ ఫీల్ అయిపోయారు. అయితే ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం తప్పకుండా టీమ్ ఇండియా టైటిల్ గెలిచి తీరుతుందని అభిమానులు అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
అందుకు తగ్గట్లుగానే లీగ్ దశ నుంచి సెమీఫైనల్ వరకు అన్ని మ్యాచ్లలో విజయం సాధిస్తూ.. ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న టీమిండియా.. నేడు ఫైనల్ లో ఆస్ట్రేలియా తో తలబడబోతుంది. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిస్తే తన యూజర్లందరికీ కూడా 100 కోట్లు పంచుతాను అంటూ ఆస్ట్రో టాక్ సీఈవో పునీత్ గుప్తా చేసిన ప్రకటన సంచలనగా మారిపోయింది. ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన. 2011లో మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు తాను కాలేజీలో ఉన్నానని .. ఇక తన జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణలలో అది ఒకటి అంటూ చెప్పుకొచ్చాడు పునీత్. ఇక ఈసారి టీమిండియా కప్ గెలిస్తే ఆ ఆనందాన్ని నా కంపెనీ యూజర్ తో పంచుకోవాలని అనుకుంటున్నాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్న అంటూ చెప్పుకొచ్చాడు.