ప్లీజ్.. మమ్మల్ని చొకర్స్ అనకండి?
అయితే ఇక ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది. మొదట్లో ఓడిపోయిన ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది సౌతాఫ్రికా. ఈ క్రమంలోనే వరుస విజయాలు సాధిస్తూ వచ్చింది. ఏకంగా పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచింది అని చెప్పాలి. దీంతో సౌత్ ఆఫ్రికా దూకుడు చూస్తే ఫైనల్ అడుగుపెట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఫైనల్లో చెత్త ప్రదర్శన చేసింది. అయితే తక్కువ స్కోర్ చేసినప్పటికీ దానిని కాపాడుకునేందుకు పోరాడింది సౌత్ ఆఫ్రికా. కాని చివరికి ఓటమి తప్పలేదు.
అయితే ఇక ఇలా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ లో ఓడిపోవడంతో మరోసారి చోకర్స్ అంటూ ఆ జట్టును పిలవడం మొదలుపెట్టారు ఎంతోమంది నెటిజెన్స్ ఇక ఇదే విషయంపై దక్షిణాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ విచారణ వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పై ఓటమి అనంతరం తమ జట్టును చాలా మంది చొకర్స్ అని అంటున్నారు. అది సరికాదు అంటూ పేర్కొన్నాడు. గెలవాల్సిన స్థితిలో ఉన్న మ్యాచ్ను చేజార్చుకునే వారినే చోకర్స్ అంటారని.. మేము ఆస్ట్రేలియాతో అద్భుతంగా పోరాడాం. 24 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన పరిస్థితి నుంచి 212 పరుగులు చేశామ్. బౌలింగ్లో ఆఖరి వరకు పోరాడాం. సెమీఫైనల్ లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోటీ నడిచింది అంటూ దక్షిణాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ చెప్పుకొచ్చాడు.