కోహ్లీని చూసి.. అతని తండ్రి గర్వపడుతుంటారు : గంభీర్
ఇక ఇలా సెంచరీల విషయంలో నేటితరం స్టార్ క్రికెటర్లు ఎవరూ కూడా విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విరాట్ కోహ్లీ 20 ఏళ్ల నుంచి ఎవరికి సాధ్యం కానీ ఒక రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ఫార్మాట్లో సచిన్ టెండుల్కర్ సాధించిన 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టి.. ఇటీవలే మ్యాచ్లో 50వ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అతను సాధించిన అద్భుతమైన ప్రపంచ రికార్డు గురించి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకుంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంత గొప్ప విజయాన్ని సాధించిన విరాట్ కోహ్లీకి అభినందనలు.. ఈ విక్టరీని చూసి విరాట్ కోహ్లీ దివంగత తండ్రి పైనుండి ఆనందపడుతూ ఉంటారు. అతను సాధించిన విజయం పట్ల తప్పకుండా గర్వపడతారు. పైనున్న మేఘాలలో నుంచి విరాట్ కోహ్లీ విజయాన్ని ఆయన కూడా చూసి ఆనందంలో మునిగిపోతారు అనుకుంటున్నా అంటూ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. ఇది వైరల్ గా మారిపోయింది. మీరు చెప్పింది నిజమే అంటూ ఎంతో మంది కోహ్లీ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాగా ఇటీవల న్యూజిలాండ్తో మ్యాచ్లో గెలిచిన టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.