న్యూజిలాండ్ బ్యాటర్ రికార్డ్.. వరల్డ్ కప్ లో భారీ సిక్సర్?
అయితే ఈ మ్యాచ్ లో సెంచరీల మోత మోగింది అని చెప్పాలి. టీమిండియా నుంచి ఇద్దరు ప్లేయర్లు సెంచరీ చేస్తే.. న్యూజిలాండ్ నుంచి ఒకరు శతకం రికార్డును సాధించారు. అదే సమయంలో సిక్సర్ల విషయంలో కూడా ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. గత కొంతకాలం నుంచి భారత బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన చేస్తూ ఇక భారీ సిక్సర్లు బాదుతున్నాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో అతిపెద్ద సిక్సర్ కొట్టి రికార్డులు సృష్టించాడు. అయితే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో శ్రేయస్ అయ్యర్ కొట్టిన 106 మీటర్ల సిక్స్ అతిపెద్ద సిక్సర్ గా కొనసాగింది.
అయితే ఈ భారీ సిక్సర్ రికార్డును ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కివీస్ బ్యాట్స్మెన్ బ్రేక్ చేశాడు. ఇటీవలే జరిగిన మ్యాచ్లో సెంచరీ తో చలరేగిపోయి ఒకానొక సమయంలో టీమిండియా ఫాన్స్ అందరిని కూడా భయపెట్టిన సెంచరీ హీరో మిచెల్ ఇక ఈ వరల్డ్ కప్ లో బిగ్గెస్ట్ సిక్సర్ కొట్టాడు. జడేజా బౌలింగ్లో అతను కొట్టిన బంతి ఏకంగా 107 మీటర్ల దూరంలో పడింది. ఇప్పటివరకు ఈ ఎడిషన్ లో ఇదే భారీ సిక్సర్ కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్ లో మిచెల్ 134 పరుగులు చేసి ఇక టీమిండియా ఫ్యాన్స్ ని కాసేపు టెన్షన్ పెట్టాడు కానీ ఆ తర్వాత షమీ ఇతన్ని పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యాడు.