టీం ఇండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోకి వచ్చినప్పుడల్లా, ఏదో ఒక రికార్డు ఖచ్చితంగా బద్దలు అవుతుంది. ఇక ఈ ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీటయ్యింది.న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ.ఇక తన రెండు దశాబ్దాల వన్డే కెరీర్‌లో సచిన్ సాధించనిది విరాట్ కోహ్లీ వాంఖడేలో సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో నాలుగు సెమీఫైనల్‌లు ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2011లో ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తన మొదటి సెమీఫైనల్ ఆడాడు. ఇక ఈ ప్రపంచకప్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. దీని తర్వాత 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సెమీఫైనల్ ఆడాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి సెమీఫైనల్ ఆడగా.. ఇప్పుడు 2023లో మరోసారి ప్రపంచకప్ సెమీఫైనల్ ఆడిన ఘనత కింగ్ విరాట్ కోహ్లికి దక్కింది.సచిన్ టెండూల్కర్ తన 24 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 6 ప్రపంచ కప్‌లు ఆడాడు.
అయితే వరల్డ్ కప్స్‌లో సెమీ-ఫైనల్‌ను మూడు సార్లు మాత్రమే ఆయన ఆడగలిగాడు. సచిన్ టెండూల్కర్ 1996, 2003, 2011 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్ టీమ్‌లో ఉన్నాడు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ను విరాట్ కోహ్లీ అధిగమించాడు.ఇక సచిన్ పేరిట వున్న మరో ప్రపంచ రికార్డుకు ఇప్పుడు విరాట్ చేరువలో ఉన్నాడు . 2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌కైనా కూడా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 99 సగటుతో 594 పరుగులు చేశాడు. అంటే సచిన్‌ను అధిగమించే అవకాశం ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి ఉంది.ఇక 49 వన్డే సెంచరీల సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు విరాట్ ఈ ప్రపంచకప్‌లో మరో సెంచరీ కనుక చేస్తే సచిన్ టెండూల్కర్ ను అధిగమించగలడు. న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని భారత అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.మరి అభిమానుల కోరికని విరాట్ కోహ్లీ నెరవేరుస్తాడో లేదో చూడాలి.