ఆ టీమ్ పై గెలిచి ఉంటే.. కథ వేరేలా ఉండేది : బాబర్
ఈ వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ప్రస్థానం ఎంత అద్వానంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న పాకిస్తాన్.. ఎక్కడ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రతి మ్యాచ్లో కూడా ఓటమి చవిచూస్తూ తీవ్ర నిరాశపరిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ జట్టు తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్గా బాబర్ ను తప్పించాల్సిందే అంటూ డిమాండ్స్ రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడకుండా.. అటు సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావించాడు. వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో గెలిచి ఉంటే కథ వేరేలా ఉండేది అంటూ అభిప్రాయపడ్డాడు. ఈ వరల్డ్ కప్ లో మా ప్రదర్శన చాలా నిరాశ కలిగించింది. మా స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదు. అదే చాలా ప్రభావం చూపించింది. బ్యాటింగ్ బౌలింగ్ లో ఎక్కడ మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఫీల్డింగ్ లోను తప్పిదాలు చేశాం. ఎక్కడ పొరపాటు జరిగింది అనే విషయాన్ని కూర్చొని మాట్లాడుకుంటాం అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు.