హాఫ్ సెంచరీతో.. రోహిత్ సెంచరీ పూర్తి?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక ఎంతో దూకుడుగా ఆడుతూ టీమిండియా కు శుభారంబాలు అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ ఓపెనర్ గా వస్తు ఇలా మంచి శుభారంబాలు  అందిస్తూ ఉండడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా ఎంతో స్వేచ్ఛగా చెలరేగి ఆడుతూ భారత జట్టుకు భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నారు.



 ఇక ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఒక సెంచరీ కూడా చేశాడు రోహిత్ శర్మ. అయితే ఇలా తన ప్రదర్శనతో ఎన్నో అరుదైన రికార్డులను కూడా కొల్లగొడుతున్నాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఇటీవల భారత జట్టు నెదర్లాండ్స్ టీం తో మ్యాచ్ ఆడింది. ఇప్పటికే వరుసగా 8 విజయాలు సాధించిన భారత జట్టు.. ఇక నెదర్లాండ్స్ లాంటి చిన్న టీం పై కూడా 160 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ఎప్పటిలాగానే రోహిత్ శర్మ మంచి ఆరంభం ఇచ్చాడు. ఏకంగా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఇక ఇటీవల నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ చేసిన హాఫ్ సెంచరీ ద్వారా ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు కెప్టెన్ రోహిత్.


 ఇంటర్నేషనల్ క్రికెట్ లో వంద 50 ప్లస్ స్కోర్ లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా వరుసగా రెండు వరల్డ్ కప్ టోర్నీలలో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి ప్లేయర్గా కూడా నిలిచాడు రోహిత్ శర్మ. ఇక ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు... ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో ఎక్కువ సిక్సర్లు బాదిన కెప్టెన్ గా.. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక రన్స్ చేసిన భారత కెప్టెన్ గా కూడా అరుదైన రికార్డు సృష్టించాడు  ఇక వన్డేల్లో ఒక వేదిక లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా కూడా నిలిచాడు. చిన్నస్వామి స్టేడియంలో ఇలా రోహిత్ సిక్సర్లలో రికార్డు సృష్టించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: