మొదట్లో రోహిత్ కెప్టెన్సీ వద్దన్నాడు : గంగూలీ

praveen
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ఇక భారత జట్టులో స్టార్ ప్లేయర్గా వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్గా హవా నడిపించడమే కాదు.. ఇక కెప్టెన్ గా కూడా భారత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ నుంచి మొదట టి20 కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. క్రమక్రమంగా మూడు ఫార్మాట్ల సారధ్య బాధ్యతలను కూడా దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లలో కూడా జట్టును ఎంతో విజయపతంలో ముందుకు నడిపిస్తున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఐసిసి ర్యాంకింగ్స్ లో మూడు ఫార్మాట్లలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచ కప్ టోర్నీలో కూడా రోహిత్ తన కెప్టెన్సీ వ్యూహాలతో అందరిని మెస్మరైజ్ చేస్తున్నాడు. భారత జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. రోహిత్ సేన ఇప్పటివరకు వరల్డ్ కప్ లో 8 మ్యాచ్ లు ఆడగా అన్నింటిలో కూడా విజయం సాధించింది అని చెప్పాలి. దీంతో ఇక భారత జట్టు యాజమాన్యం అటు రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగించి మంచి పని చేసింది అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరబ్ గంగూలీ మాత్రం షాకింగ్ విషయాన్ని ఇటీవల అభిమానులకు చెప్పాడు.



 మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా అదరగొడుతున్న రోహిత్ శర్మ.. మొదట బీసీసీఐ సారద్య బాధ్యతలు అప్పగించాలి అని చూసినప్పుడు వద్దు అని చెప్పాడట. ఈ విషయాన్ని సౌరవ్ గంగూలీ  చెప్పుకొచ్చాడు. రోహిత్ కెప్టెన్ కావాలని కోరుకోలేదు. అన్ని ఫార్మాట్లలో ఆడుతుండడం వల్ల ఒత్తిడి ఉంది అని చెప్పి కెప్టెన్సీ వద్దన్నాడు. కానీ చివరికి సారధ్య బాధ్యతలు తీసుకోమని నేనే చెప్పాను. ఎస్ చెప్తావా లేదా నీ పేరు అనౌన్స్ చేయమంటావా అంటూ అడిగాను. అయితే రోహిత్ కెప్టెన్సీకి ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం అంటూ దాదా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: