వన్డే చరిత్రలో.. ఇలా జరగటం రెండో సారి?
ఇటీవల వరల్డ్ కప్ లో భాగం గా ఒక ఆసక్తికరమైన పోరు జరిగింది. న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు న్యూజిలాండ్ మరోవైపు పాకిస్తాన్ వరస పరాజయాల తో సతమవుతున్నాయి. మొదట్లో వరుస విజయాలు సాధించిన న్యూజిలాండ్ తర్వాత హ్యాట్రిక్ ఓటముల తో వెనుక బడింది. ఇక పాకిస్తాన్ పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. ఏకంగా 400 ఒక పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో తప్పకుండా ఆ జట్టుదే విజయం అని అందరూ భావించారు.
కానీ ఊహించని రీతిలో అటు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు కూడా మంచి ప్రదర్శన చేశారు. అందుకు తగ్గట్లుగానే వర్షం రూపం లో వారికి అదృష్టం కలిసి వచ్చింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి లో విజయం వరించింది. ఈ క్రమం లోనే పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో 400 పరుగుకులకు పైగా లక్ష్యంతో బరిలోకి దిగి విజయం సాధించిన రెండో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. అంతకుముందు 2006లో ఆస్ట్రేలియాపై, దక్షిణాఫ్రికా విజయం సొంతం చేసుకుంది. ఒకవేళ వర్షం రాకపోయి ఉంటే మాత్రం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది అని చెప్పాలి.