వరల్డ్ కప్ కోసం.. కేవలం 15 మంది అంటే సరికాదు : కమిన్స్

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ పోరు సెమీఫైనల్  చేరుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక అన్ని టీమ్స్ కూడా ప్రపంచ కప్ టోర్నీలో సెమి ఫైనల్లో అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని జట్లకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఎందుకంటే జట్టులో ఉన్న కీలక ప్లేయర్లు గాయం బారిన పడుతూ ఇక ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.


 అయితే సాధారణంగా ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును మాత్రమే ఎంపిక చేస్తారు. ఇక జట్టులో ఉన్న ప్లేయర్స్ ఎవరైనా గాయపడితే ఇలా బెంచ్ స్ట్రెంత్ ఆటగాళ్ల నుంచి మరొకరిని జట్టులోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కొన్ని టీమ్స్ కి మాత్రం ఇలా 15 మంది ఆటగాళ్ళు సరిపోవడం లేదు. ఎందుకంటే జట్టులో ఎక్కువ మంది ప్లేయర్లు గాయాల బారిన పడటంతో జట్టు కూర్పు కాస్త కష్టంగా మారిపోతుంది అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న కమిన్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 ప్రపంచ కప్ లాంటి సుదీర్ఘమైన టోర్నీకి కేవలం 15 మందిని మాత్రమే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనుమతించడం సరైన పద్ధతి కాదు అంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. అయితే రెండు నెలల పాటు సాగే టోర్నమెంట్లో గాయాలు వంటి కారణాలతో ప్లేయర్లు కచ్చితంగా తగ్గిపోతారని చెప్పుకొచ్చాడు. ఇక ఐసీసీ పెట్టిన ఈ నిబంధన వల్ల క్రికెట్కు ఏమాత్రం మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా జట్టుకు కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్ళగా.. మాక్స్వెల్ గాయం బారిన పడ్డారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: